ETV Bharat / business

'కేంద్రం పరిశీలనలో గూగుల్, పేటీఎం వివాదం' - గూగుల్ పేటీఎంపై కేంద్రం స్పందన

టెక్​ దిగ్గజం గూగుల్.. పేమెంట్ సేవల సంస్థ పేటీఎంల మధ్య ఏర్పడిన వివాదం తమ దృష్టికి వచ్చినట్లు డీపీఐఐటీ సంయుక్త కార్యదర్శి అనిల్ అగర్వాల్ 'ఈటీవీ భారత్​'కు తెలిపారు. ఈ దశలో వివాదంపై చర్చించడం సరికాదని.. ఈ అంశాన్ని ప్రస్తుతం పరిశీలనలో ఉంచినట్లు వివరించారు.

Google Paytm controversy under center scrutiny
కేంద్రం పరిశీలనలో గూగుల్ పేటీఎం వివాదం
author img

By

Published : Oct 8, 2020, 2:05 PM IST

దేశీయ డిజిటల్ పేమెంట్ సేవల సంస్థ పేటీఎం, టెక్​ దిగ్గజం గూగుల్​ మధ్య తలెత్తిన వివాదం కేంద్రం దృష్టికి వచ్చింది. ఈ అంశాన్ని పరిశీలనలో ఉంచినట్లు వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ పరిధిలోని డీపీఐఐటీ సంయుక్త కార్యదర్శి వెల్లడించారు.

"రెండు సంస్థల మధ్య వివాదం మా దృష్టికి వచ్చింది. ప్రస్తుతం ఈ అంశాన్ని పరిశీలిస్తున్నాం."

-అనిల్ అగర్వాల్, ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ విభాగం (డీపీఐఐటీ) సంయుక్త కార్యదర్శి

ఈ విషయం తమ పరిశీలనలో ఉన్నప్పటికీ.. దాని గురించి ఇప్పుడే చర్చించడం సరికాదని అనిల్ అగర్వాల్​ 'ఈటీవీ భారత్​'తో అన్నారు.

వివాదం ఇలా..

నిబంధనల ఉల్లంఘన కారణాలతో పేటీఎం యాప్​ను గూగుల్.. గత నెల ప్లే స్టోర్​ నుంచి తొలగించడం ఇరు సంస్థల మధ్య వివాదానికి ప్రధాన కారణం. దీనిపై రెండు సంస్థలు బహిరంగంగానే పరస్పర ఆరోపణలు చేసుకున్నాయి.

ఇరు సంస్థల మధ్య చర్చల అనంతరం కొన్ని గంటల్లోనే తిరిగి పేటీఎం తిరిగి గూగుల్ ప్లే స్టోర్​లో ప్రత్యక్షమైంది.

ఈ వివాదం నేపథ్యంలో పేటీఎం.. మినీ యాప్​ స్టోర్​ను ఇటీవల విడుదల చేసి గూగుల్​తో పోటీకి సిద్ధమైంది.

గూగుల్ ప్లే స్టోర్ నిబంధనలే కారణమా?

ప్లే స్టోర్​ను​ వినియోగించుకునే యాప్‌లలో చెల్లింపులకు సంబంధించిన సేవలు, లావాదేవీలుంటే.. అందులో భారీ మొత్తంలో కమీషన్‌గా తమకు చెల్లించాలని గూగుల్‌ ప్లేస్టోర్‌ నిబంధన విధించింది. ఈ నేపథ్యంలోనే దేశీయ డెవలపర్ల కోసం పేటీఎం సొంత యాప్​ స్టోర్​ను ఆవిష్కరించింది. గూగుల్​తో వివాదం ఏర్పడిన కొన్ని రోజుల్లోనే పేటీఎం ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం.

ఇరు సంస్థల మధ్య చర్చల అనంతరం కొన్ని గంటల్లోనే పేటీఎంను మళ్లీ ప్లే స్టోర్​లో పునరుద్ధరించినప్పటికీ.. ఈ వివాదం.. భారత డిజిటల్ పేమెంట్ వ్యవస్థలో గూగుల్ ఆధిపత్యాన్ని బహిర్గతం చేసింది.

దాదాపు దేశంలో 95 శాతం స్మార్ట్​ఫోన్లు గూగుల్​కు చెందిన ఆండ్రాయిడ్ ఓఎస్​ ఆధారంగానే పని చేస్తున్నాయి. ఈ కారణంగా డిజిటల్ ఎకోసిస్టమ్​పై గూగుల్​ ఆధిపత్యం కొనసాగుతోంది.

ఈ వివాదంలో గూగుల్​పై పేటీఎం ఆరోపణలు..

తమ యాప్​ను ప్లే స్టోర్​ నుంచి తొలగించి.. యూపీఐ క్యాష్​ బ్యాక్, స్క్రాచ్​ కార్డ్ ఆఫర్లను తొలగిస్తేనే యాప్​ను పునరుద్ధరిస్తామని గూగుల్ ఒత్తిడి తెచ్చినట్లు పేటీఎం బ్లాగ్​లో రాసుకొచ్చింది. ఇలాంటి అనుభవమే దేశీయ భారత ఇంటర్నెట్ కంపెనీలన్నింటికీ ఉన్నట్లు పేర్కొంది.

తాము యూపీఐ క్యాష్​ బ్యాక్ ఆఫర్​ను తీసుకొచ్చిన వారం రోజులకే ప్లే స్టోర్​ నుంచి తమ యాప్​ను తొలగించిందని.. దానిపై స్పందించేదుకు అవకాశం కూడా ఇవ్వలేదని రాసుకొచ్చింది.

ఈ వివాదానికి సంబధించి గూగుల్​తో జరిగిన సంభాషణ స్క్రీన్ షార్ట్​లను కూడా పేటీఎం బ్లాగ్​లో పొందుపరిచింది.

నిజానికి గూగుల్​కు చెందిన గూగుల్​ పే.. ద్వారా కూడా ఇలాంటి సేవలు అందిస్తోందని.. అయితే గూగుల్ సొంత సంస్థకు ప్రత్యేక నిబంధనలు విధించుకున్నట్లు పేటీఎం ఆరోపించింది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.