ETV Bharat / business

ఆ ఉద్యోగులకు కరోనా ఆఫర్​- ఒక్కొక్కరికి రూ.75 వేలు - గూగుల్ ఉద్యోగులు

ప్రపంచవ్యాప్తంగా తమ కార్యాలయాల్లో కార్యకలాపాలు జులై 6 నుంచి పునరుద్ధరించనున్నట్లు గూగుల్ ప్రకటించింది. ఈ మేరకు వ్యక్తిగత సంరక్షణ పరికరాలు కొనుగోలు చేసేందుకు ప్రతి ఉద్యోగికి రూ.75 వేలు ఇస్తున్నట్లు స్పష్టం చేసింది.

Google
గూగుల్
author img

By

Published : May 27, 2020, 12:40 PM IST

ఇంటర్నెట్ దిగ్గజం గూగుల్ తన కార్యాలయాలను జులై 6 నుంచి పునరుద్ధరించాలని నిర్ణయించింది. దశలవారీగా తమ ఉద్యోగులను కార్యాలయాలకు వచ్చేలా ప్రయత్నించనుంది. అంతేకాకుండా ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఉద్యోగికి అవసరమైన పరికరాలు కొనుగోలు చేసేందుకు 1,000 డాలర్ల (రూ.75 వేలు) చొప్పున అందించనున్నట్లు తెలిపింది.

"జులై 6 నుంచి వివిధ నగరాల్లోని మా కార్యాలయ భవనాలను ప్రారంభిస్తాం. ఆఫీసులకు రావాలనుకునే ఉద్యోగులకు అవకాశం కల్పిస్తున్నాం. ఆఫీసుల్లో పరిమిత సంఖ్యలోనే ఉద్యోగులు ఉండేలా చూస్తాం. రొటేషన్​ పద్ధతిలో 10 శాతం మందిని అనుమతిస్తాం. సెప్టెంబరు వరకు 30 శాతానికి పెంచుతాం."

- సుందర్​ పిచాయ్, గూగుల్ సీఈఓ

వర్క్​ ఫ్రమ్​ హోం​ మరికొన్ని రోజులు కొనసాగాలని గూగుల్ తొలుత నిర్ణయించుకుంది. అయితే చాలా మంది ఉద్యోగులు కార్యాలయాలకు వస్తామని కోరుతున్న నేపథ్యంలో తాజా నిర్ణయం తీసుకుంది సంస్థ.

"ఉద్యోగులు స్వచ్ఛందంగా రావచ్చు. వారిపై ఎలాంటి ఒత్తిడి ఉండదు. వర్క్​ ఫ్రమ్​ హోం ద్వారానే పని చేసేందుకు ప్రయత్నించండి." అని తమ ఉద్యోగులకు పిచాయ్ సూచించారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.