ETV Bharat / business

మొబిక్విక్​పై గూగుల్ వేటు.. ప్లే స్టోర్ నుంచి తొలగింపు! - గూగుల్ మొబిక్విక్ మధ్య వివాదం

ఆరోగ్య సేతుకు సంబంధించిన ప్రకటనను తొలగించనందుకు దేశీయ పేమెంట్ యాప్ మొబిక్విక్​పై గూగుల్ వేటు వేసింది. ప్రకటన నిబంధనలు ఉల్లఘించిందనే కారణంతో మొబిక్విక్​ను ప్లే స్టోర్​ నుంచి తొలగించింది. అయితే ఇరు సంస్థల మధ్య సంప్రదింపుల తర్వాత మొబిక్విక్ తిరిగి ప్లే స్టోర్​లో కనిపించింది.

google fire on MobiKwik
మొబిక్విక్​పై గూగుల్ వేటు
author img

By

Published : May 29, 2020, 2:40 PM IST

భారత్​కు చెందిన పేమెంట్స్ యాప్‌ మొబిక్విక్‌ను ప్లేస్టోర్ నుంచి తొలగించింది గూగుల్. ఆరోగ్యసేతుకు సంబంధించిన ప్రకటనలు మొబిక్విక్‌లో కనిపించడమే గూగుల్‌ నిర్ణయానికి కారణం. అయితే ఆ లింక్‌ను తొలగించమని గూగుల్ గతంలోనే ఆ యాప్‌కు సూచించింది. కానీ, గురువారం ఎలాంటి ముందస్తు హెచ్చరిక లేకుండా సదరు యాప్‌ను ప్లేస్టోర్ నుంచి తొలగించింది. అనంతరం గూగుల్, మొబిక్విక్‌ బృందాలు ఈ అంశంపై మాట్లాడి పరిష్కరించుకున్నాయి. ఆ తరవాత ఆ యాప్‌ ప్లేస్టోర్‌లో ప్రత్యక్షమైంది.

కారణమిదే..

కొవిడ్ 19 గురించి ఎప్పటికప్పుడు ప్రజలకు సమాచారం అందించే ఉద్దేశంతో తీసుకువచ్చిన కాంటాక్ట్ ట్రేసింగ్ యాప్‌ ఆరోగ్య సేతుకు సంబంధించిన ప్రకటనలను మొబిక్విక్‌తో సహా ఇతర యాప్‌లలో చూపించాలని ఆర్‌బీఐ కోరింది. ఇదే విషయాన్ని ఆ యాప్‌ సీఈఓ బిపిన్ ప్రీత్ సింగ్ గూగుల్‌కు వెల్లడించారు. ఈ సమస్యను లేవనెత్తుతూ గూగుల్, కాంపిటిషన్ కమిషన్ ఆఫ్ ఇండియా, నీతి ఆయోగ్ సీఈఓ, పీఎంఓ, కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్‌ను ట్విటర్‌లో ట్యాగ్ చేశారు. మొబిక్విక్‌తో పాటు పేటీఎం, స్విగ్గీ, వంటి ఇతర యాప్‌లు కూడా ఆరోగ్య సేతుకు సంబంధించిన ప్రకటనలను చూపిస్తున్నాయి. అయితే ఆరోగ్య సేతుకు సంబంధించిన లింక్‌ను తొలగించిన తరవాతే మొబిక్విక్‌ ప్లేస్టోర్‌లో కనిపించింది.

ఇదీ చూడండి:గూగుల్ జోష్​తో వొడాఫోన్​ ఐడియా దూకుడు!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.