ETV Bharat / business

గూగుల్​లో ఒకేసారి 100 మందితో వీడియో కాలింగ్​..

ఒకేసారి వంద మందితో గ్రూప్ వీడియో కాలింగ్ ఫీచర్​ను అందుబాటులోకి తెచ్చింది గూగుల్​. నెస్ట్ హబ్​ మ్యాక్స్ వినియోగదారులకే ఈ సౌలభ్యం కల్పించినట్లు స్పష్టం చేసింది. ప్రస్తుతానికి అమెరికాలోనే ఈ సేవలను ప్రారంభించింది గూగుల్.

Google Nest Hub Max
గూగుల్
author img

By

Published : Jun 27, 2020, 10:20 AM IST

'నెస్ట్ హబ్​ మ్యాక్స్​'​ వినియోగదారులకు సరికొత్త ఫీచర్​ను విడుదల చేసింది దిగ్గజ సాఫ్ట్​వేర్​ సంస్థ గూగుల్. గూగుల్ మీట్​, డ్యుయో ద్వారా ఒకేసారి ఎక్కువ మందితో గ్రూప్​ కాల్​ చేసుకునే సౌలభ్యం కల్పించింది. అయితే ఈ ఫీచర్​ ప్రస్తుతానికి అమెరికాలోనే అందుబాటులోకి తెచ్చింది.

గూగుల్​ మీట్​ ద్వారా గరిష్ఠంగా వంద మంది, డ్యుయో ద్వారా 32 మంది మాట్లాడుకోవచ్చు. ఇదంతా కేవలం గూగుల్​ అసిస్టెంట్​ ఒక వాయిస్​ కమాండ్​తో చేయవచ్చని తెలిపింది సంస్థ.

ఈ డివైజ్​ల్లోనూ..

నెస్ట్ వినియోగదారులతోపాటు ఎల్​జీ ఎక్స్​బూమ్​ స్మార్ట్​ డిస్​ప్లే, జేబీఎల్​ లింక్ వ్యూ, లెనొనో 8, 10 అంగుళాల తెరలపై ఈ ఫీచర్​ అందుబాటులోకి తెచ్చినట్లు గూగుల్​ తెలిపింది.

అంతేకాకుండా మీట్​ గ్రూప్ వీడియో కాలింగ్​ మొదటిగా నెస్ట్​ హబ్​ మ్యాక్స్​లోనే ప్రారంభిస్తున్నట్లు గూగుల్ ప్రకటించింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.