ETV Bharat / business

'గూగుల్‌ డ్యుయో' గ్రూప్‌ కాలింగ్‌లో ఒకేసారి 32 మంది - New Features of Google duo

వినియోగదారుల కోరిక మేరకు డ్యుయో చాట్​లో వీడియో కాలింగ్ సౌకర్యాన్ని 12 నుంచి 32 మందికి పెంచినట్లు దిగ్గజ సంస్థ గూగుల్​ తెలిపింది. దీని కోసం కొత్త క్రోమ్​ వినియోగించాలని పేర్కొంది. అతితక్కువ బ్యాండ్‌విడ్త్‌ కనెక్షన్‌లో కూడా ఇది పనిచేసేలా తయారు చేసినట్లు వెల్లడించింది.

Google Duo increases group calling limit to 32 participants
‘గూగుల్‌ డ్యుయో’ గ్రూప్‌ కాలింగ్‌లో ఒకేసారి 32 మంది
author img

By

Published : Jun 17, 2020, 8:03 PM IST

గూగుల్‌కు చెందిన డ్యుయో చాట్‌ అప్లికేషన్‌లో మార్పులు చేసింది. వీడియో కాలింగ్‌ సౌకర్యాన్ని ఒక గ్రూపులో 12 నుంచి 32 మందికి పెంచింది. ఎక్కువ మంది గ్రూప్‌లో కలిసి ఉంటే భౌతిక దూరం పాటించడం సాధ్యమవుతుంది అని పేర్కొంది.

'ఎప్పటి నుంచో వినియోగదారులు అడుగుతున్నట్లు డ్యుయో వెబ్‌ గ్రూప్‌ కాలింగ్‌లో సభ్యుల సంఖ్యను పెంచాం. దీనిలో 32 మంది వరకు పాల్గొనవచ్చు. దీనికోసం కొత్త వెర్షన్‌ క్రోమ్‌ను వినియోగించాలి' అని గూగుల్‌ సీనియర్‌ డైరెక్టర్‌ సనజ్‌ అహరి పేర్కొన్నారు.

ఈ మార్పుతో గూగుల్‌ కూడా యాపిల్‌ ఫేస్‌ టైమ్‌తో సమమైంది. ఇక జూమ్‌ యాప్‌లో ఒకేసారి 100 మంది వరకు పాల్గొనవచ్చు. ఈ మార్పులు చేయడానికి గూగుల్‌ సరికొత్త టెక్నాలజీని ఉపయోగించుకొంది. అతితక్కువ బ్యాండ్‌విడ్త్‌ కనెక్షన్‌లో కూడా ఇది పనిచేసేలా తయారు చేసింది. వీడియో కాలింగ్‌ సమయంలో ఫొటో తీసేలా దీనిని అభివృద్ధి చేసింది.

ఇదీ చూడండి: కరోనాపై పోరులో భారత్​కు భారీ రుణ సాయం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.