గూగుల్ కృత్రిమ మేధ(ఏఐ) విభాగంలో కీలక ఉద్యోగి టిమ్‌నిట్ గెబ్రూ నిష్క్రమణతో చెలరేగిన దుమారంపై సంస్థ సీఈఓ సుందర్ పిచాయ్ క్షమాపణలు చెప్పారు. గెబ్రూ నిష్క్రమణకు దారితీసిన అంశాలను కంపెనీ సమీక్షిస్తుందని ఉద్యోగులకు పంపిన సందేశంలో పేర్కొన్నారు.
ఓ పరిశోధన పత్రం విషయంలో సంస్థ యాజమాన్యానికి, గెబ్రూకు తెలత్తిన విభేదాల కారణంగా అమె గత వారం తన బాధ్యతల నుంచి తప్పుకున్నారు. అయితే కంపెనీ తనను తొలగించినట్లు అమె ఆరోపించగా.. గూగుల్ మాత్రం గెబ్రూ రాజీనామా చేసినట్లు తెలిపింది.
ఈ విషయంపై స్పందించిన సుందర్ పిచాయ్.. గెబ్రూది రాజీనామానా, తొలగింపా అనే విషయాన్ని ప్రస్తావించకుండా.. "ప్రభావవంతమైన నల్ల జాతి మహిళా నాయకురాలు గూగుల్ నుంచి అసంతృప్తిగా వైదొలగడంపై మేము నిజాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది" అన్నారు.
గెబ్రూ విమర్శ..
సుందర్ పిచాయ్ వివరణపై గెబ్రూ విమర్శలు చేశారు. ఇందులో తనకు జవాబుదారీతనం కనిపించలేదని పేర్కొన్నారు. తనకు జరిగినదానికి క్షమాపణ లభించలేదని ట్విట్టర్లో పేర్కొన్నారు.
ఇదీ చూడండి:ఉద్యోగి నిష్క్రమణతో గూగుల్లో దుమారం ఇది..