ETV Bharat / business

పల్లెల్లో త్వరలో 'గూగుల్' ఆక్సిజన్ ప్లాంట్లు

సెర్చ్​ ఇంజన్ దిగ్గజం గూగుల్ భారత్​ పట్ల మరోసారి దాతృత్వాన్ని చాటుకుంది. గ్రామీణ ప్రాంతాల్లో ఆక్సిజన్​ ప్లాంట్లు ఏర్పాటు చేసేందుకు రూ.113 కోట్ల నిధులు కేటాయించింది. గూగుల్‌ దాతృత్వ విభాగం గూగుల్ డాట్ ఆర్గ్‌ ద్వారా పలు స్వచ్ఛంద సంస్థలతో కలిసి 80 ప్లాంట్లను ఏర్పాటు చేయనుంది.

Google grant Huge help for oxygen plants
భారత్​కు గూగుల్ భారీ సాయం
author img

By

Published : Jun 17, 2021, 2:04 PM IST

భారత్‌లో 80 ఆక్సిజన్‌ ఉత్పత్తి ప్లాంట్ల ఏర్పాటు, గ్రామీణ ఆరోగ్య కార్యకర్తల శిక్షణకు గూగుల్‌ దాతృత్వ విభాగం గూగుల్ డాట్ ఆర్గ్‌ రూ.113 కోట్లు కేటాయించింది.

గివ్ ఇండియా, పాత్‌ అనే స్వచ్ఛంద సంస్థల ద్వారా.. అధికంగా అవసరం ఉన్న, గ్రామీణ ప్రాంతాల్లో ఆక్సిజన్ ఉత్పత్తి ప్లాంట్లు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపింది. ఇందుకోసం గివ్ ఇండియాకు రూ.90 కోట్లు, పాత్‌కు రూ.18.5 కోట్లు ఇవ్వనున్నట్లు గూగుల్ డాట్ ఆర్గ్‌ వివరించింది.

20 వేల మంది ఫ్రంట్‌లైన్‌ ఆరోగ్య కార్యకర్తలకు అపోలో మెడ్‌ స్కిల్స్‌ ద్వారా కొవిడ్‌ నిర్వహణలో మెరుగైన శిక్షణ ఇచ్చేందుకు కూడా ఆర్థికసాయం చేయనున్నట్లు గూగుల్ డాట్‌ ఆర్గ్ పేర్కొంది.

15 రాష్ట్రాల్లో లక్షా 80వేల మంది గుర్తింపు పొందిన ఆశా కార్యకర్తలు, 40 వేల మంది ఏఎన్ఎంలకు నైపుణ్య శిక్షణ ఇచ్చేందుకు ఆర్మన్‌ సంస్థకు రూ.3.6 కోట్లు ఇవ్వనున్నట్లు వివరించింది. భారతీయ ఆరోగ్య రంగ మౌలిక వసతులను, ఆరోగ్య కార్యకర్తలను బలోపేతం చేయడమే తమ సంస్థ లక్ష్యమని గూగుల్‌ ఇండియా భారత ఉపాధ్యక్షుడు సంజయ్ గుప్తా తెలిపారు.

ఇదీ చదవండి:ఇకపై ఆ మెసేజ్​లను ఇతరులు చూడలేరు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.