దేశీయంగా బంగారం, వెండి ధరలు మరింత ప్రియమయ్యాయి. దేశ రాజధాని దిల్లీలో 10 గ్రాముల పసిడి ధర రూ.710 పెరిగి.. రూ. 53,797కి చేరింది. కిలో వెండి ధర రూ. 313 ఎగబాకి.. రూ. 65,540 వద్ద స్థిరపడింది.
అమెరికా కేంద్రీయ బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ విధాన నిర్ణయ ప్రకటన కోసం మదుపరులు వేచి చూస్తున్న నేపథ్యంలో ప్రీమియం లోహాల ధరలు పెరుగుదలను నమోదు చేస్తున్నాయని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ సీనియర్ విశ్లేషకులు తపన్ పటేల్ చెప్పారు.
అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు బంగారం ధర 1,958 డాలర్ల వద్ద ఉంది. వెండి ఔన్సుకు 24.27 డాలర్లుగా ట్రేడ్ అవుతోంది.
ఇదీ చూడండి: ఫెడ్ నిర్ణయానికి ముందు మదుపర్లు అప్రమత్తం