దిల్లీలో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల అంతర్జాతీయ సదస్సును కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ నేడు ప్రారంభిస్తారు. అంతర్జాతీయ ఎంఎస్ఎంఈ దినోత్సవం సందర్భంగా దేశంలో సరికొత్త వేదికకు శ్రీకారం చుట్టనున్నారు.
ఎంఎస్ఎంఈలకు ప్రోత్సాహం అందించేందుకు ఈ సదస్సును నిర్వహిస్తున్నట్లు కేంద్ర ఎంఎస్ఎంఈ మంత్రిత్వ శాఖ పేర్కొంది.
వ్యాపార, వాణిజ్య భాగస్వాముల పరిచయ వేదికగా ఈ సదస్సును ఏర్పాటు చేస్తున్నారు. దేశీయంగా ఎంపిక చేసిన కొన్ని సంస్థల ప్రతినిధులకు అంతర్జాతీయ ఔత్సాహిక పారిశ్రమికవేత్తలకు మధ్య పరస్పర చర్చలు జరగనున్నాయి.
సదస్సులో మొత్తం 44 దేశాల నుంచి 175 మంది ఎంఎస్ఎంఈ ప్రతినిధులు పాల్గొంటారు. ఐరోపా, ఆఫ్రికా, లాటిన్ అమెరికాలలోని 15 దేశాల అంబాసిడర్లు హాజరుకానున్నారు.
ఇదీ చూడండి: 'నగదు చెల్లింపుల సమాచారం దేశం దాటోద్దు'