అమెజాన్‌ను కాదని.. రిలయన్స్ రిటైల్‌తో ఒప్పందం విషయంలో ముందుకెళ్లొద్దని దిల్లీ హైకోర్టు ఏకసభ్య ధర్మాసనం ఇచ్చిన తీర్పును.. డివిజన్ బెంచ్ వద్ద సవాలు చేసింది ఫ్యూచర్ గ్రూప్.
రిలయన్స్ రిటైల్‌తో ప్యూచర్ గ్రూప్ కుదుర్చుకున్న రూ.24,713 కోట్ల ఒప్పందంలో సింగపూర్ ఆర్బిట్రేషన్ ప్యానెల్ తీర్పును సమర్థిస్తూ.. జస్టిస్ ఆర్జే మిధా నేతృత్వంలోని ఏకసభ్య ధర్మాసనం గత వారం తీర్పునిచ్చింది. ఫ్యూచర్ రిటైల్ సింగపూర్ ఆర్బిట్రేటర్స్ ఆదేశాలను ఉద్దేశపూర్వకంగానే ఉల్లంఘించినట్లు పేర్కొంది. రిలయన్స్ రిటైల్‌తో ఒప్పందంలో ఏ మాత్రం ముందుకెళ్లొద్దని ఫ్యూచర్ గ్రూప్‌ను ఆదేశించింది.
ఫ్యూచర్ గ్రూప్ అధినేత కిశోర్ బియానీ సహా ఇతర సంబంధితులు తమ ఆస్తుల వివరాలతో ఏప్రిల్ 28న కోర్టు ముందు హాజరుకావాలని స్పష్టం చేసింది. అత్యవసర ఆర్బిట్రేటర్స్ ఆదేశాలను ఉల్లంఘించినందుకు 3 నెలల పాటు ఎందుకు జైలులో పెట్టకూడదో కూడా వివరించాలని బియానీని ఆదేశించింది.
ఇవీ చదవండి: