ETV Bharat / business

జీఎంఆర్​ ఎయిర్​పోర్ట్​లో గ్రూపే ఏడీపీకి 49 శాతం వాటా - ఏయిర్​పోర్ట్​ వ్యాపారాల్లో ఏడీపీ వాటా కొనుగోలు

భారత ఎయిర్​పోర్ట్​ వ్యాపారాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. జీఎంఆర్​ ఎయిర్​పోర్ట్​ లిమిటెడ్​ (జీఏఎల్)లో 49 శాతం వాటాను ఫ్రాన్స్​కు చెందిన గ్రూపే ఏడీపీ సంస్థ కొనుగోలు చేసింది. రూ.10,780 కోట్లతో ఈ వాటాను కొనుగోలు చేసింది గ్రూపే ఏడీపీ.

France’s Groupe ADP to buy 49% stake in GMR Airports for Rs 10,780 crore
జీఎంఆర్​ ఎయిర్​పోర్ట్​లో గ్రూపే ఏడీపీకి 49 శాతం వాటా
author img

By

Published : Feb 21, 2020, 7:14 AM IST

Updated : Mar 2, 2020, 12:53 AM IST

ప్రముఖ మౌలిక సదుపాయాల నిర్మాణ సంస్థ జీఎంఆర్ ఇన్​ఫ్రాస్ట్రక్చర్​ విమానాశ్రయాల వ్యాపారాల్లో 49 శాతం వాటాను ఫ్రాన్స్​కు చెందిన గ్రూపే ఏడీపీ సొంతం చేసుకుంది. ఈ వాటాను రూ.10,780 కోట్లతో గ్రూపే ఏడీపీ​ స్వాధీనం చేసుకున్నట్లు జీఎంఆర్​ తెలిపింది. ఈ ఒప్పందం సంస్థ రుణాలు తగ్గించుకునేందుకు తోడ్పడనున్నట్లు పేర్కొంది. ఈమేరకు ఇరు పక్షాలు షేర్ల కొనుగోలు ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయని జీఎంఆర్ ప్రకటించింది. ఒప్పందం తర్వాత కూడా సంస్థ నియంత్రణ అధికారాలు తమ వద్దే ఉంటాయని తెలిపింది.

ఒప్పందం ఇలా..

రూ.22,000 కోట్ల సంస్థాగత విలువ గల జీఎంఆర్​ ఎయిర్‌పోర్ట్‌ లిమిటెడ్​(జీఎఎల్​)కు 49 శాతం వాటా కోసం గ్రూపే ఏడీపీ రూ.10 వేల 780 కోట్లు చెల్లిస్తుంది. అందులో రూ.9 వేల 780 కోట్లతో ఈ కంపెనీలో ప్రస్తుత వాటాదార్ల నుంచి వాటాలు కొనుగోలు చేస్తుంది. మరో రూ.వెయ్యి కోట్లకు జీఏఎల్​ కొత్తగా ఈక్విటీ షేర్లు జారీ చేస్తుంది. వచ్చే అయిదేళ్లలో జీఎంఆర్​ ఎయిర్‌పోర్ట్ నిర్దేశిత పనితీరును సాధిస్తే అందుకు మరో రూ.4,475 కోట్లు చెల్లించేందుకూ గ్రూపే ఏడీపీ అంగీకరించింది.

విస్తరణకు తోడ్పాటు..

మెుత్తం మీద భారత్​లో ఎయిర్‌పోర్టుల వ్యాపార విభాగంలో ఇదొక అతిపెద్ద లావాదేవీగా నిలిచిపోనుంది. విమానాశ్రయాల సేవలు బహుముఖంగా విస్తరించేందుకు ఈ ఒప్పందం దోహదం చేస్తుందని ఇరు వర్గాలు భావిస్తున్నాయి. మరోవైపు ప్రపంచ స్థాయి విమానాశ్రయాల అభివృద్ధి, సేవల సంస్థగా ఎదగాలనేది జీఎంఆర్​ గ్రూప్‌ లక్ష్యమని అందుకు గ్రూపే ఏడీపీ తో కుదిరిన ప్రస్తుత ఒప్పందం వీలు కల్పిస్తుందని జీఎంఆర్​ గ్రూప్‌ ఛైర్మన్‌ జీవీ రావు అన్నారు. ఇకపై ప్రపంచ వ్యాప్తంగా కొత్త వ్యాపార అవకాశాలు అందిపుచ్చుకుంటామని తెలిపారు.

తక్షణ అవసరాలకు..

వాటా కొనుగోలు నిమిత్తం గ్రూపే ఏడీపీ సమకూర్చే నిధుల్లో రూ,5,248 కోట్లను వెంటనే విడుదల చేస్తుందని జీఎంఆర్​ గ్రూప్‌ పేర్కొంది. దీంతో గ్రూప్‌ సంస్థల తక్షణ నిధుల అవసరాలు కొంత మేరకు తీరనున్నట్లు వివరించింది. జీఎంఆర్​ ఎయిర్‌పోర్ట్‌ లిమిటెడ్‌ కింద దిల్లీ, హైదరాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయాలతో పాటు ఫిలిప్పీన్స్​లోని మక్టాన్‌ సెబూ విమానాశ్రయం ఉన్నాయి. ఇవే కాకుండా గోవా, గ్రీస్‌లో కొత్త విమానాశ్రయాల నిర్మాణాన్నీ జీఎంఆర్​ ఈమధ్యే చేపట్టింది.

ఇదీ చూడండి:రాష్ట్రాలకు రూ.19,950 కోట్ల జీఎస్టీ పరిహారం విడుదల

Last Updated : Mar 2, 2020, 12:53 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.