ETV Bharat / business

రిలయన్స్ ఇండస్ట్రీస్​లోకి ఐఓసీ మాజీ ఛైర్మన్​ - రిలయన్స్ చమురు వ్యాపారాల్లోకి సంజీవ్ సింగ్

రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్​ఐఎల్)​ ఆయిల్​2కెమికల్స్ వ్యాపారాల అధ్యక్షుడిగా ఇండియన్​ ఆయిల్ కార్పొరేషన్​ మాజీ ఛైర్మన్​ సంజీవ్​ సింగ్ నియమితులయ్యారు. ఆర్​ఐఎల్​ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్​ ఈ విషయాన్ని వెల్లడించారు.

Former IOC Chairman join in Ril
రిలయన్స్​లోకి సంజీవ్​ సింగ్
author img

By

Published : Aug 26, 2020, 6:47 PM IST

ప్రభుత్వ రంగ చమురు సంస్థ ఇండియన్ ఆయిల్​ కార్పొరేషన్(ఐఓసీ) మాజీ ఛైర్మన్ సంజీవ్ సింగ్ రిలయన్స్ ఇండస్ట్రీస్​(ఆర్​ఐఎల్​)లో చేరారు. ఆయిల్​ 2 కెమికల్స్(ఓ2సీ) వ్యాపారాల అధ్యక్షుడిగా సంజీవ్​ సింగ్ నియమితులయ్యారు. ఈ విషయాన్ని ఆర్​ఐఎల్​ ఎగ్జిక్యూటివ్​ డైరెక్టర్​ హితల్ ఆర్​ మెస్వాని సంస్థ ఉద్యోగులకు పంపిన సర్కులర్​లో పేర్కొన్నారు. ఓ2సీ వ్యాపార బృందంతో కలిసి సంజీవ్ సింగ్ పని చేయనున్నట్లు వెల్లడించారు.

చమురు వ్యాపారాల్లో 20 శాతం వాటాను సౌదీ ఆరామ్​కో సంస్థకు విక్రయించేందుకు రిలయన్స్ ప్రయత్నిస్తోంది. ఈ ఒప్పందాన్ని సులభతరం చేసేందుకు గ్రూప్​ నుంచి ఓ2సీ వ్యాపారాలను ప్రత్యేక యూనిట్​గా విభజించేందుకు ప్రయత్నిస్తోంది ఆర్​ఐఎల్​. ఈ నేపథ్యంలోనే ఓ2సీ విభాగంలోకి సంజీవ్​ సింగ్​ను తీసుకున్నట్లు తెలుస్తోంది.

సంజీవ్ సింగ్ చమురు వ్యాపారాలకు కీలకమైన.. గ్రూప్​ మాన్యుఫ్యాక్చరింగ్ సర్వీసెస్ (జీఎంఎస్) బాధ్యతలు నిర్వహించనున్నట్లు హితల్ తెలిపారు.

ఈ ఏడాది ఫిబ్రవరిలో కూడా ఐఓసీ మరో మాజీ ఛైర్మన్​ సార్థక్ బెహూరియాను చమురు వ్యాపారాల సీనియర్ సలహాదారుగా ఆర్​ఐఎల్​ నియమించుకుంది.

ఇదీ చూడండి:ఆ రెండు టెల్కోలకు 94 లక్షల యూజర్లు గుడ్​బై

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.