ETV Bharat / business

Big Saving Days: స్మార్ట్​ఫోన్లపై అదిరే ఆఫర్లు - ఫ్లిప్​కార్ట్​ ఎస్​బీఐ కార్డ్ ఆఫర్లు

ఫ్లిప్​కార్ట్ మరోసారి అదిరే ఆఫర్లతో 'బిగ్​ సేవింగ్ డేస్' సేల్​ను ప్రారంభించింది. ఆదివారం నుంచి నాలుగు రోజుల పాటు అందుబాటులో ఉండనున్న ఈ సేల్​లో స్మార్ట్​ఫోన్లు, ల్యాప్​టాప్​లు, ఇతర ఎలక్ట్రానిక్స్​ను భారీ తగ్గింపు ధరకు విక్రయిస్తోంది. ఈ ఆఫర్ పూర్తి వివరాలు మీకోసం.

Flipkart latest offers
ఫ్లిప్​కార్ట్ బిగ్​ సేవింగ్ డేస్ ఆఫర్లు
author img

By

Published : Jun 13, 2021, 10:43 AM IST

ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్​కార్ట్ మరోసారి 'బిగ్​ సేవింగ్ డేస్​'(Flipkart Big Saving Days) సేల్​తో ముందుకొచ్చింది. ఇందులో మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్స్​ సహా ఇతర ఉత్పత్తులపై భారీ డిస్కౌంట్​లు ఇస్తోంది. బిగ్​ సేవింగ్ డేస్ సేల్​ జూన్ 13(ఆదివారం) నుంచి జూన్ 16 వరకు కొనసాగనుంది. ఈ సేల్​లో ఇస్తున్న ఆఫర్లపై పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.

ఆఫర్లు ఇలా..

  • యాపిల్ ఐఫోన్​ 11 (64 జీబీ) డిస్కౌంట్ ధరను రూ.49,999గా నిర్ణయించింది ఫ్లిప్​కార్ట్​. దీని అసలు ధర రూ. 54,900. ఎక్స్ఛేంజీ ద్వారా రూ.14,600 వరకు అదనపు డిస్కౌంట్ పొందే వీలుంది.
  • గూగుల్ పిక్సెల్ 4ఏ ధరను రూ.31,999 నుంచి రూ.26,999కి తగ్గించింది ఫ్లిప్​కార్ట్​. 6జీబీ ర్యామ్​, 128 జీబీ స్టోరేజ్​ సామర్థ్యంతో ఈ స్మార్ట్​ఫోన్ లభిస్తుంది.
  • శాంసంగ్ ఇటీవల విడుదల చేసిన బడ్జెట్ ఫోన్ గెలాక్సీ ఎఫ్​ 12 డిస్కౌంట్​ ధర రూ.9,999గా నిర్ణయించింది. దీని అసలు ధర రూ.12,999గా ఉంది. 4జీబీ ర్యామ్​, 64 జీబీ స్టోరేజ్ ఈ స్మార్ట్​ఫోన్ సామర్థ్యం.
  • ఏసర్​ యాస్పైర్​ 7 ల్యాప్​టాప్​ ధరను.. ఏకంగా రూ.89,999 నుంచి రూ.56,990కి తగ్గించింది ఫ్లిప్​కార్ట్​.
  • ఎల్​జీ యూహెచ్​డీ 65 అంగుళాల స్మార్ట్ టీవీ ఆఫర్ ధరను రూ.76,999గా నిర్ణయించింది. దీని అసలు ధర రూ.1,39,990గా ఉంది.

వీటన్నింటితో పాటు ఇతర ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు, స్మార్ట్​ఫోన్లు, గృహోపకరణాలపై భారీ డిస్కౌంట్ ఇస్తోంది. డిస్కౌంట్ ఆఫర్లతో పాటు ఎస్​బీఐ క్రెడిట్ కార్డ్​ ద్వారా చెల్లింపులు, ఈఎంఐపై 10 శాతం తక్షణ డిస్కౌంట్ కూడా పొందొచ్చు.

ఇదీ చదవండి:ఈ ఏడాది విడుదలైన ఫోన్లపై ఓ లుక్కేయండి..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.