వచ్చే ఆర్థిక సంవత్సర వార్షిక బడ్జెట్ కసరత్తుకు సిద్ధమైంది ఆర్థికమంత్రిత్వ శాఖ. ఈ నెల 14 నుంచి 2020-21 బడ్జెట్ అంచనాలకు సంబంధించి వివిధ అంశాలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఆర్థిక మందగమనం, ప్రభుత్వ ఆదాయం తగ్గుదల వంటి అంశాలపై ఆర్థిక మంత్రిత్వ శాఖ దృష్టి సారించనున్నట్లు తెలుస్తోంది. మోదీ 2.0 ప్రభుత్వానికి, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు ఇది రెండో బడ్జెట్ కానుంది.
"ముందస్తు బడ్జెట్/సవరించిన అంచనాలతో అక్టోబర్ 14 నుంచి సమావేశాలు జరగనున్నాయి. కేంద్ర బడ్జెట్ సమాచార వ్యవస్థలో పొందుపరిచిన మార్గదర్శకాలకు అనుగుణంగా... ఆర్థిక సలహాదారులు సవరించిన బడ్జెట్ అంచనా వివరాలు పొందుపరచాలి."
-ఆర్థిక మంత్రిత్వ శాఖ బడ్జెట్ విభాగ ప్రకటన
2020-21 వార్షిక బడ్జెట్‌ను ఫిబ్రవరి 1న పార్లమెంట్లో ప్రవేశపెట్టే అవకాశముంది. ఫిబ్రవరి చివర్లో బడ్జెట్ ప్రవేశపెట్టే సంప్రదాయానికి మోదీ ప్రభుత్వం 2017లో స్వస్తి చెప్పింది.
ఇదీ చూడండి: అత్యధిక స్థాయికి విదేశీ మారక నిల్వలు..!