ప్రభుత్వ రంగ బ్యాంకుల ముఖ్య కార్యనిర్వాహణాధికారులతో నేడు సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. ఆర్థిక రంగానికి చేయూత అందించే దిశగా డిపాజిట్లు పెంచడం సహా మరిన్ని సమస్యలపై ఈ భేటీలో చర్చించనున్నారు.
బ్యాంకింగేతర ఆర్థిక కార్పొరేషన్లు, చిన్న, మధ్య తరహా వ్యాపార సంస్థల్లోకి నిధుల ప్రవాహం పైనా సమీక్షించనున్నారు నిర్మల. పాక్షిక రుణ హామీ పథకం, మూలధనాన్ని పెంచేందుకు మార్కెట్ల నుంచి నిధులను రాబట్టడంపై ఈ సమావేశంలో ఆర్థికమంత్రికి బ్యాంకర్లు నివేదిక సమర్పించే అవకాశాలున్నాయి.
రూ. లక్ష కోట్ల పాక్షిక రుణ హామీ పథకాన్ని అమలు చేయడానికి కేంద్రం ఆగస్టులో మార్గదర్శకాలను జారీ చేసింది. దీని ద్వారా బ్యాంకింగేతర ఆర్థిక సంస్థల ఆస్తులను ప్రభుత్వరంగ బ్యాంకులు కొనేందుకు వీలు కల్పించింది.
నెల రోజుల వ్యవధిలో ప్రభుత్వ రంగ బ్యాంకులతో ఆర్థికమంత్రి సమావేశం కావడం ఇది రెండోసారి.
ఇదీ చూడండి: 'గ్యాస్ మౌలిక సదుపాయాలకై భారీ పెట్టుబడులు'