నష్టాలతో తాత్కాలికంగా మూతపడ్డ జెట్ ఎయిర్వేస్లో వాటా కొనుగోలుకు ఎతిహాద్‌తో సహా మరో రెండు సంస్థలు ఆర్థిక బిడ్లను దాఖలు చేసినట్లు ఎస్బీఐ నేతృత్వంలోని రుణదాతల కన్సార్టియమ్ ప్రకటించింది.
26 బ్యాంకుల కన్సార్టియానికి ప్రస్తుతం జెట్ ఎయిర్వేస్లో 51 శాతం వాటా ఉంది. ప్రస్తుతం రుణదాతలు 31.2 నుంచి 75 శాతం వాటాను విక్రయించాలనుకుంటున్నారు. ఆర్థిక బిడ్ల దాఖలుకు చివరితేది శుక్రవారంతో ముగిసింది.
ఎతిహాద్ బిడ్లను రుణదాతలు పరీక్షించనున్నట్లు ఎస్బీఐ ప్రకటించింది. దీనితో పాటు వచ్చిన మరో రెండు బిడ్లపై కూడా నిర్ణయం తీసుకుంటారు. బ్యాంకర్లు వచ్చే వారం బిడ్లను పరీక్షించనున్నారు.
జెట్ ఎయిర్వేస్లో 24 శాతం వాటాను 2013లో ఎతిహాద్ కొనుగోలు చేసింది. జెట్‌ను తిరిగి గాడిన పెట్టేందుకు గత 15 నెలల నుంచి వివిద భాగస్వామ్య సంస్థలతో పనిచేస్తున్నట్లు ఈ గల్ఫ్ ఎయిర్‌లైన్స్ ప్రకటించింది.
ఏప్రిల్ 8 నుంచి 12 వరకు ఆసక్తి వ్యక్తీకరణ ద్వారా 4 ప్రాథమిక బిడ్లను స్వీకరించింది. ఇండిగో, టీపీజీ, ఎతిహద్ ఎయిర్వేస్లను మొదటి రౌండ్ బిడ్లలో ఎంపికచేశారు.