ETV Bharat / business

పండగ ఆఫర్లకు భారీ స్పందన- సెకనుకు 110 ఆర్డర్లు - amazon salae news

పండగల సమయంలో ఈ-కామర్స్ సంస్థలు ప్రకటించిన ఆఫర్లకు భారీ స్పందన వచ్చింది. ఫ్లిప్​కార్ట్​, అమెజాన్​లో నాలుగు రోజుల్లోనే 22 వేల కోట్ల అమ్మకాలు జరిగినట్లు తెలుస్తోంది. ఫ్లిప్​కార్ట్​లో సెకనుకు 110 ఆర్డర్లు వచ్చినట్లు సంస్థ ప్రకటించింది. ఆఫర్​ కాలం పూర్తయ్యేసరికి అమ్మకాల విలువ 4.7 బిలియన్ డాలర్లకు చేరుకోవచ్చని వాణిజ్య వర్గాలు అంచనా వేస్తున్నాయి.

BIZ-FESTIVE SALES-E COMMERCE
పండగ ఆఫర్లు
author img

By

Published : Oct 22, 2020, 5:30 AM IST

పండగ సీజన్​ ఆఫర్లతో అమెజాన్, ఫ్లిప్​కార్ట్​ వంటి ఈ -కామర్స్ సంస్థలు అమ్మకాలకు వినియోగదారుల నుంచి భారీ స్పందన వచ్చింది. గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్, బిగ్​ బిలియన్​ డేస్ అంటూ ఈ కంపెనీలు ప్రకటించిన ఆఫర్లతో మొదటి నాలుగు రోజుల్లో 22 వేల కోట్ల అమ్మకాలు జరిగినట్లు తాజా గణాంకాలు స్పష్టం చేశాయి.

అక్టోబర్ 22 వరకు ఈ పండగ అమ్మకాలు కొనసాగుతున్న నేపథ్యంలో ఈ అమ్మకాల విలువ 4.7 బిలియన్ డాలర్లకు చేరుకోవచ్చునని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

సెకనుకు 110 ఆర్డర్లు..

ఫ్లిప్​కార్ట్​- బిగ్​ బిలియన్​ డేస్​లో సెకను 110 ఆర్డర్లు నమోదైనట్లు ఆ సంస్థ ప్రకటించింది. ఈ సమయంలో 66కోట్ల మంది వెబ్​సైట్​ను సందర్శించినట్లు తెలిపింది. వీటిలో 52 శాతం చిన్న పట్టణాల్లోనే నమోదైనట్లు వెల్లడించింది. ఇప్పటికే కోటి షిప్​మెంట్లు పూర్తయినట్లు స్పష్టం చేసింది. ఇప్పటివరకూ జరిగిన సేల్​లో సగానికి పైగా ఉత్పత్తులు వర్క్ ఫ్రం హోం విభాగంలోనివేనని పేర్కొంది.

రెండు రోజుల్లోనే..

అమెజాన్- గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ మొదలైన 48 గంటల్లో లక్షా పదివేల ఆర్డర్లు వచ్చినట్లు సంస్థ ప్రతినిధి తెలిపారు. ఇందులో 66 శాతం ఆర్డర్లు చిన్నచిన్న పట్టణాల నుంచి వచ్చినవేనని వెల్లడించారు.

గతేడాది ఇదే తరహా వార్షిక అమ్మకాల్లో ఈ-కామర్స్ సంస్థలు 20 వేల కోట్ల అమ్మకాలు చేపట్టాయి. ఈ సారి కరోనా వల్ల ఈ ఆన్​లైన్​ అమ్మకాలు మరింత పెరిగినట్లు నిపుణులు భావిస్తున్నారు.

ఇదీ చూడండి: ఈ-కామర్స్​ ముసుగులో చైనీయుల బెట్టింగ్ యాప్​లు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.