ETV Bharat / business

2020-21లో డాక్టర్​ రెడ్డీస్​ లాభం రూ.1,952 కోట్లు

2020-21 జనవరి-మార్చి త్రైమాసికంలో రూ.557 కోట్ల నికర లాభాన్ని గడించింది డాక్టర్​ రెడ్డీస్. పూర్తి ఆర్థిక సంవత్సరానికి గానూ సంస్థ నికర లాభం రూ.1,952 కోట్లుగా నమోదైంది.

Drug major Dr Reddy's
ఫార్మా సంస్థ డాక్టర్​ రెడ్డీస్
author img

By

Published : May 14, 2021, 3:35 PM IST

గత ఆర్థిక సంవత్సరం (2020-21) చివరి త్రైమాసికంలో రూ.557 కోట్ల నికర లాభాన్ని గడించినట్లు ఫార్మా సంస్థ డాక్టర్​ రెడ్డీస్ శుక్రవారం ప్రకటించింది. అంతకు ముందు ఆర్థిక సంవత్సరం (2019-20) ఇదే సమయంతో (రూ.781 కోట్లు) పోలిస్తే ఈ మొత్తం 29 శాతం తక్కువని తెలిపింది.

2020-21 జనవరి-మార్చి త్రైమాసికంలో సంస్థ ఆదాయం రూ. 4,608 కోట్లుగా నమోదైంది. క్రితం ఆర్థిక సంవత్సరంలో ఈ విలువ రూ.4,336.1 కోట్లగా ఉంది.

2020-21 పూర్తి ఆర్థిక సంవత్సరానికి గానూ డాక్టర్​ రెడ్డీస్​ రూ.1,952 కోట్ల నికర లాభాన్ని.. రూ.18,420 కోట్ల ఆదాయాన్ని ప్రకటించింది.

ఇదీ చదవండి:జియో ఫోన్​ యూజర్లకు ఫ్రీ టాక్​టైమ్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.