ETV Bharat / business

డాక్టర్‌ రెడ్డీస్‌ నుంచి రెమ్‌డెసివిర్‌ ఔషధం - డాక్టర్‌ రెడ్డీస్‌ నుంచి రెమ్‌డెసివిర్‌ ఔషధం

కరోనా మహమ్మారి చికిత్సలో మంచి ఫలితాలు ఇస్తోన్న రెమ్​డెసివిర్​ ఔషధాన్ని రెడిక్స్​ బ్రాండు పేరుతో దేశీయ మార్కెట్లోకి విడుదల చేసింది డాక్టర్​ రెడ్డీస్​ లేబొరేటరీస్​. గిలీడ్​ సైన్సెస్​తో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం దేశీయ మార్కెట్​కు అందిస్తున్నట్లు వివరించింది సంస్థ.

Dr Reddy's launches Remdesivir
డాక్టర్‌ రెడ్డీస్‌ నుంచి రెమ్‌డెసివిర్‌ ఔషధం
author img

By

Published : Sep 10, 2020, 6:40 AM IST

డాక్టర్‌ రెడ్డీస్‌ లేబొరేటరీస్‌ 'రెమ్‌డెసివిర్‌' ఔషధాన్ని దేశీయ మార్కెట్లో విడుదల చేసింది. 'రెడిక్స్‌' అనే బ్రాండు పేరుతో 100 ఎంజీ వయల్‌ రూపంలో దీన్ని తీసుకువచ్చినట్లు డాక్టర్‌ రెడ్డీస్‌ వెల్లడించింది. యూఎస్‌కు చెందిన గిలీడ్‌ సైన్సెస్‌కు పేటెంట్‌ హక్కులు గల ఈ ఔషధాన్ని, ఆ కంపెనీతో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం తాము తయారు చేసి దేశీయ మార్కెట్‌కు అందిస్తున్నట్లు వివరించింది. మనదేశంతో పాటు 127 దేశాల్లో ఈ ఔషధాన్ని విక్రయించే అవకాశం తమకు ఉన్నట్లు డాక్టర్‌ రెడ్డీస్‌ పేర్కొంది.

ఈ ఔషధాన్ని కొవిడ్‌-19 తీవ్రతతో ఆస్పత్రుల పాలైన బాధితులకు చికిత్సలో వినియోగిస్తున్నారు. మనదేశంలో దీనికి ఔషధ నియంత్రణ మండలి (డీసీజీఐ) 'అత్యవసర వినియోగ అనుమతి' ఇచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికే గిలీడ్‌ సైన్సెస్‌తో ఒప్పందం కుదుర్చుకొని హెటిరో, సిప్లా, జైడస్‌ కేడిలా, మైలాన్‌ ల్యాబ్స్‌ 'రెమ్‌డెసివిర్‌' ఔషధాన్ని విడుదల చేశాయి. తాజాగా డాక్టర్‌ రెడ్డీస్‌ తన ఔషధాన్ని మార్కెట్‌కు తీసుకువచ్చింది. ఇటీవల కాలంలో కొవిడ్‌-19 తీవ్రత ఎక్కువై, తదుపరి అది న్యూమోనియాగా మారి ఇబ్బంది పెడుతున్న కేసులు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అటువంటి బాధితులకు ఆస్పత్రుల్లో ఐవీ ఫ్లూయిడ్‌ ద్వారా రెమ్‌డెసివిర్‌ ఔషధాన్ని ఇస్తున్న ఉదంతాలు అధికంగా ఉంటున్నాయి. ఒక్కో రోగికి అయిదు రోజుల పాటు ఆరు డోసుల మందు వాడాల్సి వస్తోంది. తత్ఫలితంగా ఈ ఔషధం వినియోగం బాగా పెరిగింది. డాక్టర్‌ రెడ్డీస్‌ 'రెడిక్స్‌' ఔషధం ధర ఎంతనేది వెల్లడి కాలేదు. కానీ ఇతర కంపెనీలు మాత్రం ఒక్కో డోసుకు రూ.4,000 నుంచి రూ.5,000 వరకూ ధర నిర్ణయించాయి.

అర్థరైటిస్‌ నొప్పులకు ఔషధం

డాక్టర్‌ రెడ్డీస్‌ యూఎస్‌ మార్కెట్లో మరో ఔషధాన్ని ప్రవేశపెట్టింది. ఆర్థరైటిస్‌ నొప్పులకు ఉపశమనం కలిగించే డైక్లోఫెనాక్‌ సోడియమ్‌ జెల్‌ను ఓటీసీ (ఓవర్‌ ద కౌంటర్‌) ఔషధంగా యూఎస్‌లో విడుదల చేసింది. ఈ ఔషధం నొవార్టిస్‌కు చెందిన వోల్టారెన్‌ జెల్‌ అనే బ్రాండుకు జనరిక్‌ ఔషధం. దీన్ని యూఎస్‌ మార్కెట్లో విడుదల చేయటం కోసం ఎన్‌క్యూబ్‌ ఎథికల్స్‌ అనే సంస్థతో డాక్టర్‌ రెడ్డీస్‌ భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఐఆర్‌ఐ సమాచారం ప్రకారం ఈ ఏడాది మే నుంచి ఇప్పటి వరకూ యూఎస్‌లో వోల్టారెన్‌ జెల్‌ 44 మిలియన్‌ డాలర్ల అమ్మకాలను నమోదు చేసింది.

ఇదీ చూడండి: రెమిడిసివిర్‌ ఉత్పత్తి నాలుగింతలు.. కృత్రిమ కొరత లేకుండా చర్యలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.