అత్యవసర వినియోగ అనుమతులు పొందిన అనంతరం.. మార్చిలో కొవిడ్ వ్యాక్సిన్ 'స్పుత్నిక్ వీ'ను భారత్లో విడుదల చేసేందుకు ప్రణాళికలు వేస్తున్నట్లు డాక్టర్ రెడ్డీస్ ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సర క్యూ3 ఫలితాల ప్రకటన కార్యక్రమంలో సంస్థ ఏపీఐ, ఫార్మా సూటికల్ విభాగ సీఈఓ దీపక్ సాప్రా ఈ వివరాలు వెల్లడించారు. ఇప్పటికే మూడో దశ క్లినికల్ ట్రయల్స్ 70 శాతం పూర్తయ్యాయని తెలిపారు. ఫిబ్రవరిలో డోసింగ్ పూర్తవుతుందని.. తదనంతరం అత్యవసర ఉపయోగం కోసం దరఖాస్తు చేసుకోనున్నట్లు వెల్లడించారు.
2020-21 క్యూ3లో కంపెనీ.. నికర లాభం రూ.19.8 కోట్లుగా నమోదైంది. గత ఏడాది ఇదే సమయంలో కంపెనీ ఏకీకృత నికర లాభం రూ.527.4 కోట్లుగా ఉంది. క్యూ3లో రూ. 4,930 కోట్ల ఆదాయం గడించింది కంపెనీ.
ఇదీ చూడండి:'వచ్చే రెండేళ్లలో దేశార్థికం పరుగులు'