Dr Reddys Q3 Profit 2021: అగ్రశ్రేణి ఔషధ సంస్థ డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్ డిసెంబరుతో ముగిసిన మూడో త్రైమాసికంలో ఆశాజనక ఫలితాలను ప్రకటించింది. రూ.706.5 కోట్ల నికర లాభం ఆర్జించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో రూ.19.8 కోట్ల లాభాన్ని మాత్రమే ఆర్జించింది. ఆ సమయంలో సంస్థ మార్కెట్ విలువ రూ.597.2 కోట్లు తక్కువ నమోదుకావడమే అందుకు కారణం.
గత ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో రూ.4,929.6 కోట్లుగా ఉన్న ఆదాయం.. ఈసారి రూ.5,319.7 కోట్లకు చేరింది.
"మూడో త్రైమాసికంలో మేము మెరుగైన పనితీరును కనబరిచాం. అదే సమయంలో వ్యాపారాన్ని విస్తరించేందుకు పెట్టుబడులు కొనసాగిస్తున్నాం" అని రెడ్డీస్ లేబొరేటరీస్ కో-ఛైర్మన్, ఎండీ జీవీ ప్రసాద్ పేర్కొన్నారు.
ఇదీ చూడండి: ఎయిర్టెల్లో గూగుల్ 100 కోట్ల డాలర్ల పెట్టుబడి- 5జీపై గురి!