సైబర్ నెట్వర్క్ అనుంధానంతో దేశంలో టెలికామ్ రంగాన్ని మరింత ధృడ పరుస్తూ కేంద్ర ప్రభుత్వం ముందడుగేసింది. చరవాణీలను పోగొట్టుకున్నా, ఎవరైనా దొంగలించినా ట్రాక్ చేసి కనిపెట్టే విధంగా సాంకేతికత వ్యవస్థను అందుబాటులోకి తీసుకురానున్నారు.
కొత్త వ్యవస్థ వస్తే... మీ మొబైల్ ఫోన్లో సిమ్ తీసేసినా, ఐఎమ్ఈఐ నెంబర్ మార్చినా ఎక్కడుందో కనుగునే వీలుంటుందని అధికారులు తెలిపారు. ఈ ఏడాది ఆగస్టు నుంచే ట్రాకింగ్‌కు సంబంధించిన సేవలు తీసుకొస్తామని వెల్లడించారు.