బడ్జెట్ భయాలు, అంతర్జాతీయంగా బలహీన సంకేతాలతో స్టాక్ మార్కెట్లు నేడు నష్టాల్లో ట్రేడవుతున్నాయి.
బొంబాయి స్టాక్ ఎక్స్చేంజి సూచీ-సెన్సెక్స్ 202 పాయింట్లు కోల్పోయింది. ప్రస్తుతం 38,518 వద్ద ట్రేడవుతోంది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజి సూచీ-నిఫ్టీ 72 పాయింట్ల నష్టంతో 11,487 వద్ద కొనసాగుతోంది.
ఇవీ కారణాలు
కేంద్ర బడ్జెట్లో కొన్ని ప్రతిపాదనలపై మదుపరుల్లో భయాలు నెలకొన్నాయి. ముఖ్యంగా కంపెనీల్లో ప్రజల వాటాను 25 శాతం నుంచి 35 శాతానికి పెంచడం. సంపన్నులు, విదేశీ మదుపరులపై పన్ను పెంపు ప్రతిపాదనలు మదుపరుల సెంటిమెంటును ప్రభావితం చేశాయి. వీటికి తోడు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసిక ఫలితాలపై నెలకొన్న అనిశ్చితి, అంతర్జాతీయ మార్కెట్ల బలహీన సంకేతాలు కూడా నష్టాలకు కారణమంటున్నారు నిపుణులు.
లాభనష్టాల్లోనివివే..
ఎస్ బ్యాంకు, సన్ ఫార్మా, పవర్ గ్రిడ్, బజాజ్ ఫినాన్స్, ఓఎన్జీసీ, ఎన్టీపీసీ, రిలయన్స్ షేర్లు లాభాల్లో ఉన్నాయి.
ఏషియన్ పెయింట్స్, హెచ్డీఎఫ్సీ, టీసీఎస్, కోటక్ బ్యాంకు, హెచ్డీఎఫ్సీ బ్యాంకు, హెచ్‌సీఎల్ టెక్ షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి.
రూపాయి, ముడి చమురు
నేటి ట్రేడింగ్‌లో రూపాయి 17 పైసలు క్షీణించింది. డాలర్‌తో పోలిస్తే మారకం విలువ 68.83 వద్ద కొనసాగుతోంది.
ముడి చమురు ధరల సూచీ-బ్రెంట్ 0.22 శాతం తగ్గింది. అంతర్జాతీయ మార్కెట్లో బ్యారెల్ ముడి చమురు ధర 63.97 డాలర్లుగా ఉంది.
ఆసియాలోని ఇతర ప్రధాన మార్కెట్లు.. షాంఘై సూచీ, హంకాంగ్ సూచీ, దక్షిణ కొరియా సూచీలు నష్టాలతో ప్రారంభమయ్యాయి. జపాన్ సూచీ లాభాలతో సెషన్ ప్రారంభించింది.