ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని యాపిల్ 'మ్యాక్ బుక్ ప్రో' పాత ల్యాప్‌టాప్ మోడళ్లను విమానంలోకి తీసుకురావద్దని ప్రయాణికులకు సూచించింది డీజీసీఏ. వీటిలోని బ్యాటరీల ఓవర్ హీటింగ్ సమస్యతో ప్రమాదం జరిగే అవకాశం ఉందని స్పష్టం చేసింది.
2015-17మధ్యలో ఉత్పత్తి చేసిన వాటిల్లో అమర్చిన బ్యాటరీ పేలే ప్రమాదం ఉందని అమెరికా కన్జ్యూమర్ ప్రొడక్ట్ సేఫ్టీ కమిషన్ పేర్కొంది. జూన్ 20లో యాపిల్ స్వచ్ఛందంగా 15 అంగుళాల మ్యాక్ బుక్ ప్రో ల్యాప్‌టాప్‌లను రీకాల్ చేసింది.
యాపిల్ లెక్కల ప్రకారం 26 కేసుల్లో మ్యాక్‌బుక్ ప్రో విపరీతంగా వేడెక్కినట్లు తేలింది. ఈ ప్రమాదాల్లో ఐదుగురు వినియోగదారులకు స్వల్పగాయాలు అయ్యాయి. పొగ వెలువడటం వంటి ఘటనలు చోటు చేసుకొన్నాయి.
ఇదీ చూడండి: రెడ్మీ నోట్ 8... మరో సూపర్ బడ్జెట్ ఫోన్ అవుతుందా?