కరోనా వైరస్‌కు పది నెలల్లోనే దేశీయంగా టీకా (Covid cases in India) అభివృద్ధి చేయడం తీవ్రమైన సవాల్‌తో కూడుకున్న అంశమని, దీన్ని భారత్ బయోటెక్ (Bharat Biotech Covaxin) విజయవంతంగా పూర్తి చేసిందని ఆ సంస్థ డైరెక్టర్ డాక్టర్ వి. కృష్ణ మోహన్ (Bharat Biotech news) పేర్కొన్నారు. కరోనా వ్యాప్తి భారత్‌లోకి ప్రవేశించినప్పుడు (Covid in India) ఎలాంటి టీకాలు అందుబాటులో లేవని గుర్తు చేశారు. బెంగళూరు టెక్ సమిట్ 2021లో భారత టీకా నాయకత్వం అంశంపై మాట్లాడిన ఆయన.. వ్యాక్సిన్ తయారీ విషయంలో కేంద్ర ప్రభుత్వం సైతం సరైన నిర్ణయాలు తీసుకుందని చెప్పారు.
"ఫార్మా రంగానికి, టీకా తయారీదారులకు ఇది కఠినమైన సవాలు. కరోనాను ఎదుర్కొనే టీకాను అభివృద్ధి చేయడానికి మాకు పది నెలల సమయమే ఇచ్చారు. ఈ కొద్ది నెలల్లోనే కొవాగ్జిన్‌ను (covaxin vaccine) తయారు చేసి మేం విజయవంతమయ్యాం. ప్రభుత్వం సరైన సమయంలో సరైన చర్యలు తీసుకుంది. బయోటెక్నాలజీ మంత్రిత్వ శాఖ వాస్తవ దృక్ఫథంతో ఆలోచించింది. గతంలో ఇలా ఎప్పుడూ జరగలేదు కాబట్టి.. తక్కువ సమయంలో టీకా తయారు చేయడం అసాధ్యమని అనిపించేది."
-డాక్టర్ కృష్ణ మోహన్, భారత్ బయోటెక్ డైరెక్టర్
స్వదేశీ కొవిడ్ టీకాను అభివృద్ధి చేసేందుకు భారత్ బయోటెక్ (Bharat Biotech news) పటిష్ఠమైన ప్రణాళికతో ముందుకెళ్లిందని మోహన్ తెలిపారు. కొవాగ్జిన్‌ను విడుదల చేసి కోట్లాది మంది ప్రాణాలు కాపాడటంలో సంస్థ విజయవంతమైందన్నారు. అదే సమయంలో టీకా సమర్థత, ప్రభావంపై ఏ స్థాయిలోనూ రాజీ పడలేదని స్పష్టం చేశారు. టీకా తయారీలో భాగంగా తాము చేసిన శ్రమను వర్ణించి చెప్పలేమని అన్నారు.
'నిధులతో మేలు'
మరోవైపు, గత దశాబ్ద కాలంగా తమ పనితీరును సానుకూలంగా మార్చుకొని మెరుగైన ఫలితాలు సాధిస్తోందని ఐసీఎంఆర్‌ను ప్రశంసించారు కృష్ణ మోహన్. ఫార్మా కంపెనీలకు భారత ప్రభుత్వం రూ.50 లక్షల నుంచి రూ.50 కోట్ల వరకు నిధులు అందిస్తోందని.. ఈ సాయం వల్ల సంస్థలు తమ ప్రణాళికలను మెరుగ్గా అమలు చేసేందుకు వీలవుతోందని తెలిపారు.
ఇదీ చదవండి: