ETV Bharat / business

కరోనాతో ప్యాకేజ్డ్ ఉత్పత్తులకు మరింత గిరాకీ - ఆహార ఉత్పత్తుల రంగంపై కరోనా ప్రభావం

కరోనా సంక్షోభంలో శుభ్రమైన పద్ధతిలో ప్రాసెస్ చేసిన(ప్యాకేజ్డ్​) ఉత్పత్తులకు డిమాండ్ పెరుగుతోందని ఐటీసీ వ్యవసాయ వ్యాపార విభాగాధిపతి ఎస్‌.శివకుమార్‌ తెలిపారు. 'ఈనాడు'కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయాలు వెల్లడించారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఆహార ఉత్పత్తుల వ్యాపారం ఎదుర్కొంటున్న సవాళ్లపై శివకుమార్ వెల్లడించిన మరిన్ని అంశాలు ఆయన మాటల్లోనే..

DEMAND RISE FOR PACKAGE FOOD
ప్యాకేజ్డ్​ ఆహారానికి పెరిగిన డిమాండ్
author img

By

Published : May 6, 2020, 10:38 AM IST

'కరోనా వైరస్‌ వ్యాప్తి అనంతరం నిత్యావసరాల్లోనూ నాణ్యతకు ప్రాధాన్యం పెరుగుతోంది. శుభ్రమైన పద్ధతిలో ప్రాసెస్‌ చేసిన వాటి కోసం వినియోగదారులు చూస్తున్నారు. ఇందువల్ల విడి ఉత్పత్తుల నుంచి ఎఫ్‌ఎంసీజీ కంపెనీ ఉత్పత్తులకు గిరాకీ అధికమవుతోంది. ఇందుకనుగుణంగా భిన్న ఉత్పత్తులను అందుబాటులోకి తెస్తాం' అని ఐటీసీ వ్యవసాయ వ్యాపార విభాగాధిపతి ఎస్‌.శివకుమార్‌ చెప్పారు. లాక్‌డౌన్‌ నిబంధనల్లో అత్యవసరాలతో పాటు మరిన్ని ఉత్పత్తుల తయారీకి ప్రభుత్వం అనుమతులిచ్చినా, కార్మికుల లభ్యత, ముడిసరకు సమీకరణ, సరఫరాలే ప్రధానంగా ఇబ్బంది పెడుతున్నాయని 'ఈనాడు' ఇంటర్వ్యూలో వివరించారు.

ముఖ్యాంశాలివీ..

కరోనా వైరస్‌ లాక్‌డౌన్‌ పరిస్థితులను ఎలా ఎదుర్కొంటున్నారు?

లాక్‌డౌన్‌ నుంచి ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లు అన్నింటికీ అనుమతిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. కారం, గోధుమపిండి, బిస్కెట్లు-నూడిల్స్‌ తయారీ వంటి సంస్థలకు అనుమతులు మొదటినుంచీ ఉన్నాయి. ఇప్పుడు పళ్లరసాలు, చిప్స్‌ వంటి వాటి తయారీకీ అనుమతిస్తున్నారు. దేశం మొత్తంమీద ఐటీసీకి 85 వరకు ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లుంటే, ఇందులో తెలంగాణా, ఆంధ్రప్రదేశ్‌లలో 7-8 ఉన్నాయి. మిరప, పసుపు వంటి స్పైసెస్‌తో పాటు బిస్కెట్‌ తయారీ యూనిట్లు ఇక్కడ ఉన్నాయి. గ్రీన్‌జోన్‌లలో ఇబ్బంది లేకున్నా, కంటెయిన్‌మెంట్‌ జోన్‌ల పరిధిలో కష్టంగా ఉంటోంది. ముఖ్యంగా కార్మికులు ఇళ్లకు వెళ్లిపోవడం సమస్యగా మారింది. ముడిపదార్థాల సమీకరణ కూడా కొంత కష్టంగా ఉంది.

ముడి పదార్థాల కోసం మీకు రైతులతో ఒప్పందాలున్నాయి కదా?

వరి, గోధుమలు, నూనెగింజల సమీకరణ ఇప్పుడు చేస్తున్నాం. మాకు రైతులతో ఒప్పందాలుండి, సరకు నేరుగా కొనుగోలు చేసిన ప్రాంతాల్లో ఇబ్బందులేమీ లేవు. కానీ మార్కెటింగ్‌ యార్డులలో కొనుగోలు చేయాల్సిన చోట మాత్రం ఆటంకాలు ఎదురవుతున్నాయి. కొన్నిచోట యార్డులు మూసే ఉన్నాయి. ఉదాహరణకు గోధుమపిండి కోసం మధ్యప్రదేశ్‌లో గోధుమలు సమీకరిస్తాం. రెడ్‌జోన్‌ వల్ల అక్కడ యార్డులు మూసిఉన్నాయి. అదే మార్కెట్‌యార్డులు గ్రీన్‌జోన్లలో ఉన్నచోట ఇబ్బంది లేదు. బంగాళాదుంపల సమీకరణకు ఇబ్బందులు తొలిగాయి. కార్మికుల లభ్యత, నగరాల్లో అంతర్గత వాహనాల రవాణా మాత్రం కష్టంగానే ఉంది. రైతులతో మెరుగైన పద్ధతుల్లో సాగు చేయించేందుకు క్షేత్రస్థాయి సిబ్బందికి ఇ-చౌపాల్‌ 4.0 వంటి మొబైల్‌ సాంకేతికతలు ఇచ్చి కృషి చేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్‌లోని మిరప రైతులకు మడతపెట్టే వీలున్న చిల్లీడ్రైయర్లు అందించి, కూలీలు దూరంగా ఉంటూనే పనిచేసేలా సహకరించాం. ఇందువల్ల 30 శాతం సమయం ఆదా అయ్యిందని అంచనా.

కరోనా వైరస్‌ వ్యాప్తిని అరికట్టేందుకు ప్రభుత్వం సూచించిన నిబంధనల వల్ల వ్యయాలు పెరిగాయా?

ఉత్పత్తుల తయారీ ప్రక్రియలో పూర్తిస్థాయి నిబంధనలు అమలు పరుస్తున్నాం. కార్మికులను శానిటైజర్లు, మాస్క్‌ల దగ్గర నుంచి వారికి థర్మల్‌ స్క్రీనింగ్‌ చేశాకే ప్లాంటుల్లోకి అనుమతించడం, సామాజిక దూరం పాటించేలా చూడటం వంటి వాటికి అదనపు వ్యయాలు అవుతున్నాయి. దీంతోపాటు రవాణా ఖర్చు పెరిగింది. కాకపోతే ప్రయాణికుల రైళ్లు లేనందున, గూడ్స్‌ వ్యాగన్ల సరఫరా శరవేగంగా మారింది. ఉత్తర భారతం నుంచి దక్షణి ప్రాంతానికి గతంతో పోలిస్తే సగం సమయంలోనే రైళ్లలో సరకు వచ్చేస్తోంది. ఇది అనుకూలంగా ఉంది. లారీల్లో తరలించేందుకు రాష్ట్రాల సరిహద్దుల్లో ఇబ్బందులున్నా, పరిస్థితి కుదుట పడుతోంది.

పళ్ల రసాల తయారీ ప్రారంభించారా?

మే నెలలో ప్రారంభిస్తాం. ప్రస్తుతం దుకాణాలు కూడా అన్నీ ప్రారంభం కాలేదు. పట్టణాలు, నగరాలలో కూడా పరిమిత సమయంలో మాత్రమే తీస్తున్నారు. అందువల్ల సాధారణ గిరాకీ వచ్చేందుకు ఇంకా సమయం పడుతుంది. వీధుల్లో గతం మాదిరి చేతులతో యంత్రాలపై తీసి ఇచ్చే రసాలు, ఆహార పదార్థాలకు గిరాకీ తగ్గుతుంది. పెద్ద కంపెనీలు సురక్షిత పద్ధతుల్లో పళ్ల రసాలు రూపొందిస్తాయనే నమ్మకంతో కొనుగోలు చేయడం పెరుగుతుంది. ఇప్పటికే పిండి వంటి వాటిల్లో ఇది కనపడుతోంది.

ఏమైనా ఉత్పత్తులకు గిరాకీ పెరిగిందా /తగ్గిందా?

ఆఫ్రికా వంటి దేశాలకు బియ్యం ఎగుమతి పెరిగింది. ఇకపోతే హోటళ్లు, రెస్టారెంట్లు తెరచుకోనందున రొయ్యల వంటి శీతలీకరించిన ఆహారానికి గిరాకీ తగ్గింది. ఇవి సాధారణ స్థాయికి చేరేందుకు సమయం పడుతుంది.

ఇదీ చూడండి:కొలువులకు కరోనా గండం.. ఉద్యోగుల్లో అభద్రతాభావం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.