ETV Bharat / business

కొలువులకు కరోనా గండం.. ఉద్యోగుల్లో అభద్రతాభావం - కరోనా సంక్షోభంతో ఉద్యోగాలకు కోత

కరోనా దెబ్బకు అన్నమో రామచంద్రా అంటున్న వాళ్లే కాదు.. ఉద్యోగమో రామచంద్రా అనేవాళ్ల సంఖ్యా పెరుగుతోంది. లాక్‌డౌన్‌తో ఆర్థిక కార్యకలాపాలు నిలిచిపోయి చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా వ్యాపార సంస్థలు, కంపెనీలు డీలాపడ్డాయి. ఈ పరిణామం వేతనాలు, ఉద్యోగాల కోతకు దారితీస్తోంది. ఇటీవల విడుదలైన చాలా సర్వేలు ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి.

jobs cut due to corona
కరోనాతో ఉద్యోగాల కోత
author img

By

Published : May 6, 2020, 7:24 AM IST

కొవిడ్‌-19 సృష్టించిన పరిస్థితులు, లాక్‌డౌన్‌ పరిణామాలతో తమ ఉద్యోగం ఉంటుందో లేదోననే అభద్రతాభావం చాలా మంది ఉద్యోగుల్లో నెలకొంది. ఐటీ, తయారీ, మీడియా రంగాల్లో పనిచేస్తున్న ఉద్యోగులపై నిర్వహించిన ఓ సర్వేలోనూ ఇదే విషయం తేలింది. భవిష్యత్‌లో ఉద్యోగ స్థిరత్వం, కెరీర్‌ పురోగతి కొనసాగడం సందేహమేనని సర్వేలో ఎక్కువ మంది అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం గమనార్హం.

ఏమో.. ఏమవుతుందో

లింక్డ్‌ఇన్‌ నిర్వహించిన ఈ సర్వే ప్రకారం.. తయారీ రంగంలోని నలుగురు వృత్తి నిపుణుల్లో ఒకరు, ఐదుగురు ఐటీ వృత్తి నిపుణుల్లో ఒకరు, ఐదుగురు మీడియా ఉద్యోగుల్లో ఇద్దరు రాబోయే ఆరు నెలల్లో తమ కంపెనీల పనితీరు ఏమీ బాగోపోవచ్చని అభిప్రాయపడ్డారు. అయితే దీర్ఘకాలంలో అంటే రాబోయే రెండేళ్ల కాలంలో బలమైన వృద్ధిని నమోదుచేస్తాయని 77% మంది తయారీ రంగ వృత్తి నిపుణులు, 67% మంది మీడియా ఉద్యోగులు, 65% మంది ఐటీ వృత్తి నిపుణులు నమ్మకాన్ని వ్యక్తం చేశారు. ‘

ఉద్యోగాలు, వేతనాల కోత, నెమ్మదించిన ఆర్థిక వ్యవస్థ లాంటి అంశాలు ఉద్యోగుల్లో ఆందోళనకు కారణం అవుతున్నాయి. ప్రతి ముగ్గురి భారతీయుల్లో ఒకరికి వ్యక్తిగత ఆదాయం తగ్గుతోంది. రాబోయే రోజుల్లో కొత్త ఉద్యోగాలకు అవకాశాలు తక్కువగా ఉన్నాయనే అభిప్రాయం అటు ఉద్యోగార్థుల్లోనే కాదు ఉద్యోగం చేస్తున్న వాళ్లలోనూ నెలకొంద’ని సర్వే పేర్కొంది. ఉద్యోగ స్థిరత్వం, భవిష్యత్‌ అవకాశాలపై లింక్డ్‌ఇన్‌ తాజాగా సేకరించిన అభిప్రాయాల ప్రకారం ఉద్యోగుల నమ్మకపు సూచీ +51 పాయింట్లకు దిగివచ్చింది. అంతకుముందు ఈ సూచీ +53 పాయింట్ల వద్ద ఉంది.

ఏప్రిల్‌ 1-7, ఏప్రిల్‌ 13-19 మధ్య 2,254 మంది నుంచి అభిప్రాయాలను సేకరించి లింక్డ్‌ఇన్‌ ఈ సర్వే రూపొందించింది. ఇప్పటికే వివిధ రంగాల కంపెనీలు కొత్త నియామకాలు ఉండబోవని స్పష్టం చేయడంతో మున్ముందు ఉద్యోగావకాశాలు పెద్దగా ఉండకపోవచ్చనే అభిప్రాయానికి ఉద్యోగార్థులు వచ్చేసినట్లు సర్వే గుర్తించింది. సర్వేలో 48 శాతం మంది ఉద్యోగార్థులు ఉద్యోగావకాశాలు తగ్గుతాయని అభిప్రాయపడ్డారు.

పట్టణాల్లోనే అధికం

కొవిడ్‌-19, లాక్‌డాన్‌ పరిణామాల నేపథ్యంలో దేశంలో నిరుద్యోగిత రేటు గణనీయ స్థాయిలో పెరిగింది. మే 3తో ముగిసిన వారంలో 27.11 శాతానికి చేరిందని సెంటర్‌ ఫర్‌ మానిటరింగ్‌ ఇండియన్‌ ఎకానమీ (సీఎంఐఈ) వెల్లడించింది.

దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి ప్రారంభమైన మార్చి మధ్యనాటికి నిరుద్యోగిత రేటు 7 శాతం మాత్రమే. రెడ్‌ జోన్‌లు (కరోనా కేసులు ఎక్కువగా ఉన్న ప్రాంతాలు) అధికంగా ఉంటున్న పట్టణ ప్రాంతంలోనే నిరుద్యోగిత రేటు గణనీయంగా పెరిగిందని సీఎంఐఈ తన నివేదికలో వెల్లడించింది. గ్రామీణ ప్రాంతాల్లో నిరుద్యోగిత రేటు 26.69 శాతం కాగా.. పట్టణ ప్రాంతాల్లో నిరుద్యోగిత రేటు 29.22 శాతంగా ఉందని తెలిపింది.

నివేదిక గుర్తించిన అంశాలు..

  • కొవిడ్‌-19 వ్యాప్తి ప్రారంభమైన తర్వాత మార్చి 29తో ముగిసిన వారం నుంచి దేశంలో నిరుద్యోగిత స్థిరంగా పెరుగుతూ వచ్చిందని సీఎంఐఈ నివేదిక గుర్తించింది.
  • మార్చిలో నిరుద్యోగిత రేటు 8.74 శాతంగా ఉండగా.. ఏప్రిల్‌లో 23.52 శాతానికి పెరిగింది.
  • పుదుచ్చేరిలో అత్యధికంగా నిరుద్యోగిత రేటు 75.8 శాతంగా నమోదైంది. ఆ తర్వాతి స్థానంలో తమిళనాడు (49.8%), ఝార్ఖండ్‌ (47.1%), బిహార్‌ (46.6%) ఉన్నాయి. మహారాష్ట్రలో నిరుద్యోగిత రేటు 29.9 శాతంగా ఉండగా.. ఉత్తరప్రదేశ్‌లో 21.5%, కర్ణాటకలో 29.8 శాతంగా నమోదైంది.
  • కొండ ప్రాంతాలు ఎక్కువగా ఉండే రాష్ట్రాలు హిమాచల్‌ ప్రదేశ్‌ (2.2%), సిక్కిం (2.3%), ఉత్తరాఖండ్‌ (6.5%)లో అత్యల్ప నిరుద్యోగిత రేటు నమోదైంది.
  • లాక్‌డౌన్‌తో ఆర్థిక కార్యకలాపాలు నిలిచిపోవడం వల్ల దిల్లీ, ముంబయి లాంటి నగరాలకు పనుల నిమిత్తం వలస వచ్చిన వాళ్లకు ఉపాధి దొరకడం కష్టమననే ఆందోళన వ్యక్తమవుతోందని నివేదిక వెల్లడించింది.
  • కాగా.. కరోనా ప్రభావంతో భారత్‌లోనే కాదు అమెరికాలోనూ నిరుద్యోగిత గణనీయంగా పెరిగిన సంగతి తెలిసిందే. ఉద్యోగాలు కోల్పోవడంతో దాదాపు 2.6 కోట్ల మంది ప్రజలు ఆ దేశ ప్రభుత్వ సాయం కోసం దరఖాస్తు చేస్తుకున్నారు.

ఆ భయం భారతీయుల్లోనే ఎక్కువ..

భారతీయుల్లో ఎక్కువ మందిని ఉద్యోగం పోతుందేమోననే భయం వెంటాడుతోందని ఓ సర్వే వెల్లడించింది. కొవిడ్‌-19 మహమ్మారి కారణంగా ఉద్యోగం, జీవన విధానంపై ప్రభావం పడొచ్చని 86 శాతం మంది ఆందోళన వ్యక్తం చేసినట్లు పేర్కొంది. బ్రిటన్‌కు చెందిన పరిశోధన సంస్థ క్రాస్‌బై టెక్స్టార్‌ గ్రూపు ఐదు దేశాల్లోని (అమెరికా, బ్రిటన్‌, భారత్‌, ఆస్ట్రేలియా, హాంకాంగ్‌) పరిస్థితులపై ఏప్రిల్‌ 23 నుంచి 27 మధ్య ఆన్‌లైన్‌ ద్వారా ఈ సర్వేను నిర్వహించింది. ఇతర దేశాలతో పోలిస్తే కరోనా వ్యాప్తి నియంత్రణకు భారత్‌లో ప్రభుత్వం చేపడుతున్న చర్యలపై ఎక్కువ మంది సంతృప్తిని వ్యక్తం చేసినప్పటికీ.. ఉద్యోగ భద్రతపై ఎక్కువ మంది ఆందోళనతో ఉండటాన్ని సర్వే గుర్తించింది.

సర్వేలో ఇంకా ఏముందంటే..

  • కొవిడ్‌-19, లాక్‌డౌన్‌ పరిణామాల అనంతరం ఉద్యోగం పోతుందేమోననే ఆందోళనను భారత్‌లో 86 శాతం మంది వ్యక్తం చేశారు. బ్రిటన్‌లో 31% మంది, ఆస్ట్రేలియాలో 33% మంది, అమెరికాలో 41% మంది, హాంకాంగ్‌లో 71% మంది ఈ తరహా ఆందోళనతో ఉన్నారు.
  • భారత్‌లో కరోనా వ్యాప్తి ప్రాథమిక దశలోనే ఉండటమే కాకుండా వేగంగా వ్యాప్తి చెందుతోందని 84 శాతం మంది అభిప్రాయపడ్డారు. కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టిందని అమెరికా, బ్రిటన్‌, ఆస్ట్రేలియాకు చెందిన వాళ్లు వెల్లడించగా.. వైరస్‌ను అదుపులోకి తెచ్చినట్లు హాంకాంగ్‌ నుంచి సర్వేలో పాల్గొన్న వాళ్లు తెలిపారు.

ఇదీ చూడండి:దేశ వ్యాప్తంగా 27.11 శాతం పెరిగిన నిరుద్యోగ రేటు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.