ETV Bharat / business

దేశ వ్యాప్తంగా 27.11 శాతం పెరిగిన నిరుద్యోగ రేటు

కరోనా కారణంగా దేశ వ్యాప్తంగా నిరుద్యోగ రేటు పెరిగిందని భారతీయ ఆర్థిక వ్యవస్థ పరిశీలక సంస్థ సీఎంఐఈ వెల్లడించింది. మార్చి నెలలో 7 శాతం ఉన్న నిరుద్యోగిత రేటు మే 3 నాటికి 27 శాతంగా ఉన్నట్లు తెలిపింది. ఏప్రిల్​ చివరి నాటికి పుదుచ్చేరిలో అత్యధికంగా 75.8 శాతంగా ఉన్నట్లు పేర్కొంది.

The nationwide unemployment rate rose 27.11 percent
దేశ వ్యాప్తంగా 27.11 శాతం పెరిగిన నిరుద్యోగిత రేటు
author img

By

Published : May 5, 2020, 9:37 PM IST

కొవిడ్‌-19 మహమ్మారి కారణంగా భారత్‌లో నిరుద్యోగిత రేటు 27.11 శాతానికి ఎగబాకిందని భారతీయ ఆర్థికవ్యవస్థ పరిశీలక సంస్థ- సీఎంఐఈ తెలిపింది. కరోనాకు ముందు మార్చి మాసం మధ్యలో 7 శాతం లోపుగా ఉన్న ఈ నిరుద్యోగ రేటు మే 3 నాటికి 27.11 శాతానికి చేరిందని.. పట్టణ ప్రాంతాల్లో ఎక్కువగా ఉన్నట్లు ముంబయి కేంద్రంగా పనిచేసే ఈ సంస్థ తెలిపింది.

పట్టణ ప్రాంతాల్లో ఎక్కువగా రెడ్‌జోన్లుండగా.. అక్కడ నిరుద్యోగిత రేటు 29.22 శాతంగా ఉందని, గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం 26.69 శాతంగా ఉందని వెల్లడించింది. కరోనా కట్టడికి విధించిన లాక్‌డౌన్ కారణంగా ఎన్నడూ లేనంతగా నిరుద్యోగిత పెరిగిపోతోందని అభిప్రాయపడింది

వారం వారానికీ ఈ గణాంకాలు పెరిగి పోతున్నాయన్న సీఎంఐఈ .. మార్చితో పోల్చుకుంటే ఏప్రిల్‌లో నిరుద్యోగిత 8.74 శాతం పెరిగి 23.52 శాతానికి పెరిగిందని స్పష్టం చేసింది.

రాష్ట్రాల వారీగా..

ఏప్రిల్ చివరికి పుదుచ్చేరిలో అత్యధికంగా 75.8 శాతం నిరుద్యోగిత పెరిగిందన్న సీఎంఐఈ .. తమిళనాడులో 49.8 శాతం, మహారాష్ట్రలో 20.9 శాతం పెరిగిందని తెలిపింది. పర్వత ప్రాంత రాష్ట్రాలైన హిమాచల్ ప్రదేశ్ , సిక్కింలో మాత్రం రెండున్నర శాతంలోపే నిరుద్యోగిత రేటుండగా.. ఉత్తరాఖండ్‌లో మాత్రం 6.5 శాతంగా ఉందని చెప్పింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.