ETV Bharat / business

ఫేస్​బుక్, వాట్సాప్​ను బ్యాన్​ చేయండి: సీఏఐటీ - మాతృ సంస్థ ఫేస్​బుక్​

వాట్సాప్ నూతన ప్రైవసీ విధానాలను భారత్​లో అమలు చేయొద్దని అఖిల భారత వ్యాపారుల సమాఖ్య(సీఏఐటీ) డిమాండ్ చేసింది. ఈ మేరకు కేంద్ర ఐటీ శాఖ మంత్రి రవిశంకర్​ ప్రసాద్​కు లేఖ రాసింది.

CAIT ASK ABOUT BAN ON WTSAPP
ఫేస్​బుక్, వాట్సాప్​ను బ్యాన్​ చేయండి: సీఏఐటీ
author img

By

Published : Jan 10, 2021, 7:19 PM IST

వాట్సాప్​ ప్రతిపాదిస్తున్న నూతన ప్రైవసీ విధానాలను భారత్​లో అమలు పరచకుండా అడ్డుకోవాలని అఖిల భారత వ్యాపారుల సమాఖ్య(సీఏఐటీ) కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్​ చేసింది. లేదంటే వాట్సాప్​తో పాటు దాని​ మాతృ సంస్థ ఫేస్​బుక్​ను సైతం నిషేధించాలని కోరింది. ఈ మేరకు కేంద్ర ఐటీ మంత్రి రవిశంకర ప్రసాద్​కు లేఖ రాసింది.

ప్రమాదంలో గోప్యత..

నూతన నిబంధనలతో వ్యక్తిగత సమాచారం, నగదు చెల్లింపులు, లొకేషన్​ సహా ఇతర కీలక సమాచారమంతా వాట్సాప్​ చేతుల్లోకి వెళ్లిపోతుందని సీఏఐటీ ఆందోళన వ్యక్తం చేసింది. కేంద్రం వెంటనే స్పందించి వాట్సాప్, ఫేస్​బుక్​ను నిషేధించాలని కోరింది. ఇప్పటికే ఫేస్​బుక్ చేతిలో 20కోట్ల మంది భారతీయులకు సంబంధించిన సమాచారం ఉందని.. దీంతో ఆర్థిక వ్యవస్థకు, దేశ భద్రతకు ముప్పు పొంచి ఉందని పేర్కొంది.

అలాంటిదేమీ లేదు: వాట్సాప్

తమ సేవల్లో పారదర్శకత కోసమే నూతన ప్రైవసీ విధానాలను రూపొందించామని వాట్సాప్ అధికార ప్రతినిధి స్పష్టం చేశారు. వ్యాపారులకు మరింత భద్రతతో కూడిన సేవలందించేందుకు ఇవి తోడ్పడతాయని వివరించారు. వీటికి వినియోగదారు అనుమతి తప్పనిసరని.. గోప్యత పరిరక్షణకు వాట్సాప్​ కట్టుబడి ఉందని స్పష్టం చేసింది.

ఇదీ చదవండి: డేటా షేరింగ్‌పై 'వాట్సాప్‌' వివరణ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.