భారత కంపెనీల్లో చైనా పెట్టుబడులు నాలుగేళ్లలో 12 రెట్లు పెరిగాయి. 2019లో ఏకంగా 4.6 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టినట్లు ప్రముఖ పరిశోధన సంస్థ గ్లోబల్‌డేటా తాజా నివేదికలో వెల్లడైంది. 2016లో చైనా పెట్టుబడుల మొత్తం 381 మిలియన్ డాలర్లుగా మాత్రమే ఉన్నట్లు నివేదిక పేర్కొంది.
భారత్‌కు వచ్చిన ఈ పెట్టుబడుల్లో 17 నుంచి 24 శాతం చైనాకు చెందిన రెండు దిగ్గజ సంస్థలు అలీబాబా, టెన్సెంట్ల నుంచి వచ్చినట్లు ఈ నివేదిక వివరించింది.
అలీబాబాకు చెందిన ఆర్థిక సేవల సంస్థ ఆంట్ ఫినాన్షియల్ సహా ఇతర సంస్థలు.. ప్రముఖ అంకురాలైన పేటీఎం, స్నాప్‌డీల్, బిగ్‌బాస్కెట్, జొమాటో వంటి సంస్థల్లో 2.6 బిలియన్ డాలర్లు పెట్టుబడిగా పెట్టాయి. టెన్సెంట్ సహా మరిన్ని చైనా సంస్థలు ఓలా, స్విగ్గీ, హైక్, డ్రీమ్ 11, బైజూస్ వంటి సంస్థల్లో 2.4 బిలియన్ డాలర్ల వరకు పెట్టుబడిగా పెట్టాయని నివేదిక అంచనా వేసింది.