ETV Bharat / business

మీడియాలో వాటా విక్రయానికి జాక్​ మాపై చైనా ఒత్తిడి!

చైనా మీడియా సంస్థల్లో అలీబాబాకు ఉన్న వాటా విక్రయించాలని జాక్​ మాపై ఆ దేశ ప్రభుత్వం ఒత్తిడి చేస్తున్నట్లు సమాచారం. గత ఏడాది నుంచి చైనా కమ్యూనిస్టు ప్రభుత్వం జాక్​మాపై అణచివేత ధోరణి ప్రదర్శిస్తోంది. ఇందులో భాగంగానే తాజా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

author img

By

Published : Mar 16, 2021, 11:44 AM IST

China pressures Alibaba to sell media assets
అలీబాబా మీడియా ఆస్తుల విక్రయానికి చైనా ఒత్తిడి

చైనా కమ్యూనిస్టు ప్రభుత్వం, టెక్​ దిగ్గజం అలీబాబా వ్యవస్థాపకుడు జాక్​ మా మధ్య వైరం మరింత ముదురుతున్నట్లు తెలుస్తోంది. కొన్నాళ్లుగా జాక్​మాపై అణచివేత ధోరణి అవలంబిసున్న జిన్ పింగ్ ప్రభుత్వం.. మరో సంచలన నిర్ణయం తీసుకుంది.

హాంకాంగ్ కేంద్రంగా పని చేస్తున్న సౌత్​ చైనా మార్నింగ్ పోస్ట్ సహా మీడియా సంస్థల్లో అలీబాబా వాటాలను విక్రయించాలని జాక్​ మాపై చైనా ప్రభుత్వం ఒత్తిడి చేస్తున్నట్లు సమాచారం. ప్రజాభిప్రాయాల్లో టెక్​ దిగ్గజం ప్రభావం పెరుగుతోందన్న ఆందోళనలే ఇందుకు కారణమని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి.

గత ఏడాది నుంచి జాక్​ మాపై చైనా ప్రభుత్వం గుర్రుమీదుంది. ఓ బహిరంగ సభలో చైనా ఆర్థిక విధానాలను జాక్​ మా ఎండగట్టడమే ఇందుకు ప్రధాన కారణం. ఫలితంగా ప్రపంచంలో అతిపెద్ద ఐపీఓను తొక్కిపట్టింది చైనా. ఈ కారణం వల్లే చాలా రోజులు జాక్ అజ్ఞాతంలో ఉన్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.