ETV Bharat / business

జేమ్స్​ కేమరూన్ డిజైన్​ చేసిన 'అవతార్' బెంజ్​ కారు​ ఇదే! - బెంజ్​ అవతార్ కారు

2009లో వచ్చిన అవతార్​ చిత్రం.. బాక్సాఫీస్​ చరిత్రను తిరగరాసింది. ఆ సినిమా ఇచ్చిన స్ఫూర్తితో ప్రముఖ లగ్జరీ కార్ల దిగ్గజం మెర్సిడెజ్ బెంజ్​ అద్భుతమైన కారును రూపొందించింది. సరికొత్త సాంకేతికతతో అవతార్ దర్శకుడు జేమ్స్ కేమరూన్​ సాయంతో ఈ ఆవిష్కరణ చేసింది. ఎలక్ట్రానిక్ దిగ్గజం సోనీ కూడా అనూహ్యంగా ఈ ఏడాది కార్ల తయారీ రంగంలో అడుగుపెట్టింది.

'అవతార్' బెంజ్​ కారు
'అవతార్' బెంజ్​ కారు
author img

By

Published : Jan 8, 2020, 6:05 AM IST

'అవతార్' బెంజ్​ కారు

ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడెజ్​ బెంజ్​.. సరికొత్త ఆవిష్కరణ చేసింది. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఆకర్షణీయ హంగులతో కొత్త కారును రూపొందించింది. ఈ కారుకు ఏవీటీఆర్​ అనే నామకరణం చేసింది మెర్సిడెజ్​.

అమెరికా లాస్​వెగాస్​లో జరుగుతున్న కన్​స్యూమర్​ ఎలక్ట్రానిక్​ షో-2020లో ఈ ఆవిష్కరణకు అధిక మార్కులు పడ్డాయి. ఇదే వేదికగా సంస్థ విడుదల చేసిన ప్రచార వీడియో.. ప్రేక్షకులను చూపుతిప్పుకోకుండా చేసింది.

కేమరూన్ సాయంతో..

హాలీవుడ్​ దర్శక దిగ్గజం జేమ్స్​ కేమరూన్​ 'అవతార్' చిత్రం​ థీమ్​తో.. ఆయన సాయంతో ఈ కారు రూపుదిద్దుకుందని బెంజ్ సంస్థ తెలిపింది. సినిమాల్లోనే కనిపించే గ్రాఫిక్స్​ నిజజీవితంలో సాధ్యమయ్యేలా ఈ కారును రూపొందించింది. ఇందులో ఆర్గానిక్​ ఘటాలతో తయారు చేసిన రీసైకిల్​ బ్యాటరీలను అమర్చుతామని పేర్కొంది.

సోనీ నుంచి మొదటిసారి..

ఎలక్ట్రానిక్​ దిగ్గజం సోనీ.. కార్ల వ్యాపారంలో అడుగుపెట్టేందుకు సీఈఎస్​ను వేదికగా చేసుకుంది. అయితే సంప్రదాయ కార్ల తయారీ కాకుండా సరికొత్త ఎలక్ట్రిక్​ కాన్సెప్ట్​తో ఈ కారును సొంత సాంకేతికతతో రూపొందించింది సోనీ.

'విజన్​-ఎస్​' పేరుతో త్వరలో మార్కెట్లోకి రానున్న ఈ కారు రవాణా వ్యవస్థలో సరికొత్త విప్లవాన్ని తీసుకొస్తుందని సంస్థ విశ్వాసం వ్యక్తం చేసింది. ఈ కారు... ప్రయాణ సమయంలో పరిసరాలను సెన్సార్ల ద్వారా స్కాన్​ చేసి సూచనలు ఇస్తుంది. ట్రాఫిక్​తో పాటు ఎదురుగా వస్తున్న వాహనాల గురించి హెచ్చరికలు చేస్తుంది.

"ఇందులో వినోద అంశాలు జోడించాం. మేము అందిస్తున్న 360 రియాలిటీ ఆడియోతో సంగీతం వినటంలో కొత్త అనుభూతి కలుగుతుంది. ఈ కారు మనుషుల ఆలోచనలను ముందుగానే పసిగడుతుంది. పెద్ద తెరల ద్వారా వినోదంతో పాటు డ్రైవింగ్ సమాచారం ఎప్పటికప్పుడు అందిస్తుంది."

-కెనిచిరో యోషిదా, సీఈఓ, సోనీ

New Delhi, Jan 06 (ANI): Prime Minister Narendra Modi attended centenary celebrations of Kirloskar brothers in national capital. PM Modi also inaugurated a book on Laxmanrao Kirloskar during the event. Customised stamps, commemorating the registration of Kirloskar brothers were also released by PM Modi. Speaking at the event, Prime Minister Narendra Modi said, "As we enter the New Year, I have no hesitation in saying that this decade will be for Indian entrepreneurs."

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.