ప్రముఖ ఫాస్ట్ ఫుడ్ వ్యాపార సంస్థ 'బర్గర్ కింగ్ ఇండియా' లిస్డింగ్ ట్రేడ్‌లో అదరగొట్టింది. ఇష్యూ ధర (రూ.60)తో పోలిస్తే తొలి ట్రేడ్‌లో షేరు దాదాపు 120 శాతం పెరిగింది.
బీఎస్ఈలో 92.25 శాతం ప్రీమియంతో రూ.115.35 వద్ద సెషన్ ప్రారంభించింది బర్గర్ కింగ్. ప్రస్తుతం 120 శాతానికిపైగా వృద్ధితో రూ.133 వద్ద ట్రేడవుతోంది.
ఎన్ఎస్ఈలో 87.5 శాతం వృద్ధితో 112.50 వద్ద సెషన్‌ను ప్రారభించిన ఈ సంస్థ షేరు ప్రస్తుతం రూ.134 వద్ద కొనసాగుతోంది.
బీఎస్ఈ ప్రకారం.. బర్గర్ కింగ్ మార్కెట్ క్యాపిటల్ రూ.4,927 కోట్లుగా ఉంది.
రూ.810 కోట్ల సమీకరణ లక్ష్యంతో ఐపీఓకు వచ్చిన బర్గర్ కింగ్.. 156.65 రెట్లు అధికంగా సబ్‌స్క్రైబ్ అయ్యింది.