ఇండోనేసియా, ఇథియోపియా విమాన ప్రమాదాలకు కారణమని భావిస్తున్న ఎంసీఏఎస్ యాంటీ స్టాల్ వ్యవస్థలో లోపాలను.. బోయింగ్ సరిదిద్దినట్లు పరిశ్రమ వర్గాల ద్వారా తెలిసింది. ఐదు నెలల్లో రెండు బోయింగ్ 737 మ్యాక్స్ 8 విమానాలు ప్రమాదం బారిన పడిన కారణంగా.. వీటిలో లోపాలపై దృష్టి పెట్టిందీ తయారీ సంస్థ.
గతేడాది అక్టోబరులో జరిగిన దుర్ఘటనలో 189 మంది మృత్యువాత పడ్డారు. మార్చి 10న జరిగిన ఇథియోపియన్ ఎయిర్‌లైన్స్ ప్రమాదంలో 157 మంది మరణించారు.
ఈ దుర్ఘటనలతో బోయింగ్‌పై ఒత్తిడి పెరిగింది. తక్షణమే చర్యలు తీసుకోపోతే సంస్థ మనుగడకే నష్టమని తెలుసుకున్న బోయింగ్ వెంటనే లోపాలు సరిదిద్దే పనిలో పడింది.
తాజాగా బోయింగ్ 737 మ్యాక్స్ 8 విమానాల సాఫ్ట్ వేర్ అప్డేట్ చేసింది. ఈ సాఫ్ట్‌వేర్‌ను అన్ని బోయింగ్ 787 మ్యాక్స్ విమానాల్లో నవీకరించేందుకు.. ఫెడరల్ ఏవియేషన్ ఏజెన్సీ నుంచి అనుమతులు లభించాల్సి ఉంది.