సాంకేతికతలో ప్రపంచం రోజు రోజుకు కొత్త పుంతలు తొక్కుతోంది. ఈ నేపథ్యంలో అన్ని పనులకు టెక్నాలజీని వినియోగించడం వల్ల ఎన్నో ఉద్యోగాలకు ఎసరు వస్తుందని ఇప్పటికే చాలా సర్వేలు హెచ్చరిస్తున్నాయి. అయితే ఆటోమేషన్‌కు పెరుగుతున్న ఆదరణ కారణంగా టెలికాం రంగంలో వచ్చే 3-5 ఏళ్లలో చాలా మంది ఉద్యోగాలు కోల్పోయే అవకాశముందని ఆ రంగానికి చెందిన నిపుణుడు ఎస్.పీ. కొచ్చర్ అభిప్రాయపడ్డారు.
"వచ్చే 3-5 ఏళ్లలో టెలికాం రంగంలో చదువులేని ఉద్యోగులు ఉండటం కష్టం. బ్లూకాలర్ ఉద్యోగులు లేకుండా టవర్ల నిర్వహణ వంటి పనులు సాగటం కష్టమే. కానీ.. 5జీ పూర్తిగా అందుబాటులోకి వస్తే ఆయా ఉద్యోగాలకు డిమాండ్ గణనీయంగా తగ్గుతుంది." --- ఎస్.పీ. కొచ్చర్, టెలికాం నైపుణ్య మండలి సీఈఓ.
ప్రపంచంలో నెలకొన్న సుంకాల యుద్ధం ప్రభావం టెలికాం రంగంపైనా పడుతుందని కొచ్చర్ అభిప్రాయపడ్డారు. కృత్రిమ మేధ వంటి అత్యాధునిక సాంకేతకత వల్ల పరిజ్ఞానం ఉన్న వారికే అధికంగా ఉద్యోగాలు లభిస్తాయన్నారు.
ఇదీ చూడండి: సామ్సంగ్ నుంచి ఆర్-సిరీస్ 5జీ స్మార్ట్ఫోన్లు..!