ETV Bharat / business

Biological E: ముల్లును 'ముల్లు'తోనే.. కార్బివాక్స్‌ - బయోలాజికల్ ఈ వ్యాక్సిన్ ధర

కరోనా వైరస్​కు వ్యాక్సిన్​ను అభివృద్ధి చేస్తున్న సంస్థల్లో హైదరాబాద్​కు చెందిన బయోలాజికల్‌-ఈ కూడా ముందు వరుసలో ఉంది. మిగతా వ్యాక్సిన్​లతో పోలిస్తే తమ వ్యాక్సిన్​ ప్రత్యేకమని చెబుతోంది సంస్థ. కరోనావైరస్‌లో అత్యంత ప్రమాదకరమైన స్పైక్‌ ప్రొటీన్​ మానవ శరీరంలోకి వైరస్‌ ఆర్‌ఎన్‌ఏను పంపే ప్రక్రియను అడ్డుకునే విధంగా తమ వ్యాక్సిన్​ పని చేయనున్నట్లు వివరించింది. ఈ వ్యాక్సిన్​కు సంబంధించిన మరిన్ని విశేషాలు ఇలా ఉన్నాయి.

How does Biological E vaccine work
బయోలాజికల్ ఈ వ్యాక్సిన్ పని చేసే విధానం
author img

By

Published : Jun 6, 2021, 12:38 PM IST

కరోనా వైరస్‌లో అత్యంత ప్రమాదకరమైన భాగం స్పైక్‌ ప్రొటీన్‌. ఇది మానవ శరీరంలో తయారయ్యే ఏసీఈ-2 అనే ఎంజైమ్‌కు అతుక్కొని శరీరంలోకి వైరస్‌ ఆర్‌ఎన్‌ఏను పంపిస్తుంది. ఈ ప్రక్రియను అడ్డుకునే విధంగా టీకాలను తయారు చేస్తున్నారు. వీటికి ఇప్పటి వరకు అచేతన వైరస్‌, మెసెంజర్‌ ఆర్‌ఎన్‌ఏ, కరోనా వైరస్‌ను రూపు పోలిన అడినో వైరస్‌తో టీకాలను చేశారు. తాజాగా భారత్‌లో మరో టీకా విడుదలకు సిద్ధమైంది. బయోలాజికల్‌-ఈ రూపొందిస్తున్న టీకాలో కొంచెం భిన్నమైన టెక్నాలజీని వాడారు. భారత్‌కు దాదాపు 30 కోట్ల టీకాలను సరఫరా చేసేందుకు ఒప్పందం కూడా కుదిరింది. ప్రయోగ పరీక్షలు కూడా తుది దశకు చేరుకున్నాయి.

కార్బివాక్స్‌ రూపుదిద్దుకొంది ఇలా..

అమెరికాలోని టెక్సస్‌ రాష్ట్రంలో ఉన్న బేలార్‌ కాలేజ్‌ ఆఫ్‌ మెడిసిన్‌కు చెందిన 'నేషనల్‌ స్కూల్‌ ఆఫ్‌ ట్రాపికల్‌ మెడిసిన్‌'(ఎన్‌ఎస్‌టీఎం) సహకారంతో ఈటీకాను రూపొందించారు. ఈ సంస్థ కొన్నేళ్లుగా సార్స్‌, మెర్స్‌ వ్యాధుల టీకా తయారీపై పనిచేస్తోంది. 'కరోనాపై సమర్థంగా పనిచేసే టీకాకు అవసరమైన టెక్నిక్‌లు మాకు తెలుసు' అని ఎన్‌ఎస్‌టీఎం డీన్‌ డాక్టర్‌ పీటర్‌ హోటెజ్‌ పేర్కొన్నారు.

గతేడాది ఫిబ్రవరిలో కరోనావైరస్ జన్యుక్రమం అందుబాటులోకి వచ్చింది. దీంతో ఎన్‌ఎస్‌టీఎం శాస్త్రవేత్తలు వైరస్‌లోని స్పైక్‌ ప్రొటీన్‌, జన్యువులను అధ్యయనం చేయడం మొదలుపెట్టారు. ఆ తర్వాత దానిని మార్పులు చేసి క్లోనింగ్‌ చేశారు. ఆ జన్యువును 'ఈస్ట్‌'లో ఉంచారు. ఈస్ట్‌ స్పైక్‌ ప్రొటీన్‌ కాపీలను తాయరు చేయడం మొదలు పెట్టింది. 'ఈ ప్రక్రియ బీర్‌ను తయారు చేయడాన్ని పోలి ఉంటుంది. ఈ ప్రక్రియలో ఈస్ట్‌ మార్పులు చేసిన ప్రొటీన్‌ను ఉత్పత్తి చేస్తుంద'ని డాక్టర్‌ హోటెజ్‌ వివరించారు.

ఎలా పని చేస్తుంది..

ఈస్ట్‌ నుంచి ఉత్పత్తి అయిన స్పైక్‌ ప్రొటీన్‌ను వేరు చేసి శుద్ధి చేస్తారు. ఆ తర్వాత అడ్జువెంట్‌ను వినియోగించి టీకాను తయారు చేస్తారు. ఇది రోగనిరోధక శక్తిని ప్రేరేపిస్తుంది. దీనిలో వినియోగించే చాలా పదార్థాలను తేలిగ్గా ఉత్పత్తి చేయవచ్చు.. పైగా చౌకగా లభిస్తాయి. ఈ టీకా కరోనావైరస్‌ స్పైక్‌ ప్రొటీన్‌ను ఎలా అడ్డుకోవాలో ముందే శరీరంతో సాధన చేయిస్తుంది. దీంతో నిజమైన వైరస్‌ వచ్చినప్పుడు శరీరం స్పందిస్తుంది.

ఆగస్టులో బేలార్‌ కాలేజ్‌ ఆఫ్‌ మెడిసిన్‌ ఈ టీకాకు అవసరమైన కణాల ఉత్పత్తి బ్యాంక్‌ను హైదరాబాద్‌కు చెందిన బయోలాజికల్‌-ఈ సంస్థకు అందజేసింది. ఆ సంస్థ భారత్‌లో టీకాను తయారు చేసి ఇప్పటికే రెండు దశల ప్రయోగ పరీక్షలను పూర్తి చేసుకుంది. మూడో దశ పరీక్షలు జులైలో పూర్తవుతాయని అంచనా. ఈ క్రమంలో టీకాను ప్రపంచ వ్యాప్తంగా ఎగుమతి చేయడానికి ఉత్పత్తి సామర్థ్యాన్ని కూడా పెంచుతున్నారు. దీనిని రెండు డోసులు తీసుకోవాల్సి ఉంటుంది. దీని ధర కూడా తక్కువగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. 'భారత్‌, ఇతర పేద, మధ్య శ్రేణి దేశాలకు చౌకా టీకా అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా ఈ ఒప్పందం చేసుకున్నాం' అని కంపెనీ ఎండీ మహిమా దాట్ల బిజినెస్‌ టుడేకు వెల్లడించారు.

ప్రభుత్వంతో భారీ ఒప్పందం..

భారత ప్రభుత్వం తొలిసారి టీకా అనుమతులు పూర్తికాక ముందే ఈ సంస్థతో 30 కోట్ల డోసులకు ఒప్పందం కుదుర్చుకుని రూ.1,500 కోట్లు చెల్లించింది. ఈ ఒప్పందం కింద వచ్చే టీకాలతో 15 కోట్ల మందికి వ్యాక్సినేషన్‌ చేయవచ్చు. దీంతోపాటు డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ బయో టెక్నాలజీ ద్వారా ప్రయోగ పరీక్షల కోసం రూ.100 కోట్ల గ్రాంట్‌ను కూడా మంజూరు చేసింది.

కంపెనీ వివరాలు..

హైదరాబాద్‌కు చెందిన బయోలాజికల్‌-ఈ సంస్థను 1953లో డాక్టర్‌ డీవీకే రాజు ప్రారంభించారు. రక్తం చిక్కబడకుండా ఉండే హెపరిన్‌ను ఇక్కడ ఉత్పత్తి చేశారు. 1962లో టీకాల తయారీ రంగంలోకి అడుగుపెట్టింది ఈ సంస్థ. ప్రస్తుతం మహిమ దాట్ల కంపెనీకి ఎండీగా వ్యవహరిస్తున్నారు. ఈ కంపెనీ డీపీటీ టీకాలను భారీగా ఉత్పత్తి చేస్తోంది. ప్రపంచంలోనే టెటనస్‌ టీకాలను అత్యధికంగా తయారు చేసే సంస్థ కూడా ఇదే. ఇక్కడ ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆమోదించిన డిప్తిరియా, టెటనస్‌, హెపటైటస్‌ బీ, హీమోఫీలియస్‌ ఇన్ఫ్లూయెంజా టైప్‌-బి వంటి వాటికి టీకాలను ఉత్పత్తి చేస్తున్నారు. ఇక్కడి నుంచి 100 దేశాలకు టీకాలు సరఫరా అవుతుంటాయి.

సెప్టెంబర్‌ నుంచి నెలకు ఏడున్నర కోట్లు..!

భారత్‌లో అతిపెద్ద టీకా ఉత్పత్తి దారుల్లో బయోలాజికల్‌-ఈ కూడా ఒకటి. ఇది సెప్టెంబర్‌ నుంచి ప్రతి నెలా 7.5 కోట్ల టీకాలను ఉత్పత్తి చేస్తుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఇప్పటికే సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ కూడా నెలకు 10 కోట్ల టీకాలను ఉత్పత్తి చేస్తామని ప్రకటించింది. బయోలాజికల్‌ ఈ సంస్థకు ఏటా 100 కోట్ల డోసులు ఉత్పత్తి చేసే సామర్థ్యం ఉంది. భారత్‌లో సీరం ఇన్‌స్టిట్యూట్‌కు తప్ప మరే సంస్థకు భారీ స్థాయిలో టీకాల ఉత్పత్తి సామర్థ్యం లేదు. సీరమ్‌ సంస్థ ఏటా 160 కోట్ల డోసులను ఉత్పత్తి చేయగలదు. దీనికి మరో 100 కోట్ల డోసుల ఉత్పత్తి సామర్థ్యాన్ని భవిష్యత్తులో జోడించనుంది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.