ఆర్థికంగా దివాలా తీసిన జెట్ ఎయిర్వేస్ను 'నేషనల్ కంపెనీ లా ఆఫ్ ట్రైబ్యునల్' (ఎన్సీఎల్టీ)కు పంపాలని ఎస్బీఐ నేతృత్వంలోని బ్యాంకుల కన్సార్టియం నిర్ణయించింది. సెబీ మినహాయింపు ఒప్పందం కుదరాలని షరతులతో కూడిన బిడ్ను ప్రతిపాదించారు ఓ పెట్టుబడిదారు. ఈ నేపథ్యంలో దివాలా కోడ్ 'ఐబీసీ' ప్రకారమే రుణదాతల సమస్యల పరిష్కారం సాధ్యమవుతుందని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు బ్యాంక్ ప్రకటించింది.
రుణదాతలు శామన్ వీల్స్, గాగర్ ఎంటర్ ప్రైజె స్ జూన్ 10న రుణాల విషయంపై ఎన్సీఎల్టీని ఆశ్రయించారు. ఈ పిటిషన్పై ట్రైబ్యునల్ జూన్ 20 న విచారణ చేపట్టనుంది.
నిధుల కొరతతో ఏప్రిల్ 17న సేవలు నిలిపివేసిన జెట్ ఎయిర్ వేస్ రూ.8.5 కోట్లు శామన్ వీల్స్, రూ.53 లక్షల గాగర్కు బకాయి పడింది. స్టేట్ బ్యాంక్ నేతృత్వంలోని బ్యాంకుల కన్సార్టియంకు రూ.8 కోట్ల మేర బాకీ పడింది. ఉద్యోగుల వేతనాలను కలిపితే ఈ మొత్తం బాకీ భారం రూ.15 కోట్లు.
ఇదీ చూడండి: భారీగా పతనమైన జెట్ ఎయిర్వేస్ షేర్లు