చాలా వరకు బ్యాంకులు మార్చి నాటికి.. ఎన్పీఏలు తగ్గి మంచి స్థాయిలో ఉంటాయని భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్బీఐ) ఛైర్మన్ రజ్నీశ్ కుమార్ ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రస్తుతం రుణాల వ్యవస్థలో ద్రవ్య కొరత లేదని ఆయన తెలిపారు.
ఫిక్కీ 92 వార్షిక సదస్సులో పాల్గొన్న ఆయన ఈ విషయాలు వెల్లడించారు.
అయితే కార్పొరేట్స్ ఈ మధ్య కాలంలో అప్పులు అడగట్లేదని రజ్నీశ్ పేర్కొన్నారు. స్పెక్ట్రమ్ వేలం నిమిత్తం టెలికాం రంగానికి అప్పులిచ్చే విషయాన్ని ప్రస్తావిస్తూ అవి పూర్తిగా అభద్రతతో కూడుకున్న రుణాలని అభిప్రాయం వ్యక్తం చేశారాయన.
"మా వరకు స్పెక్ట్రమ్‌ల కోసం టెలికాం రంగానికి రుణాలివ్వడం అంటే అది పూర్తిగా భద్రత లేనిదే. స్పెక్ట్రంను ప్రభుత్వం వేలం వేస్తుంది కనుక పేపర్లపై అది భద్రంగానే ఉంటుంది. కానీ ఆచరణాత్మకంగా చూస్తే ఆ రుణాలు అంత సురక్షితం కావు. ఇందులో రుణాల ఎగవేతకు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందుకే ఆ రుణాల విషయంలో బ్యాంకులు చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తుంటాయి" - రజ్నీశ్ కుమార్, ఎస్బీఐ ఛైర్మన్
ఇదీ చూడండి: గూగుల్‌కు భారీ జరిమానా విధించిన ఫ్రాన్స్!