ETV Bharat / business

సమ్మె సైరన్​: ఈనెల 31, ఫిబ్రవరి 1న బ్యాంకులు బంద్​ - నెలాఖారులో బ్యాంకుల సమ్మె

మరోసారి సమ్మె సైరన్ మోగించాయి బ్యాంకు యూనియన్లు. ఇండియన్​ బ్యాంక్ అసోసియేషన్​తో జరిగిన.. వేతన సమీక్ష చర్చలు విఫలమైన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు యునైటెడ్​  ఫోరం ఆఫ్​ బ్యాంక్ యూనియన్స్(యూఎఫ్​బీయూ) వెల్లడించింది. ఈ నెల 31, ఫిబ్రవరి 1న సమ్మెకు దిగనున్నట్లు ప్రకటించింది.

BANK STRIKE
బ్యాంకుల సమ్మె
author img

By

Published : Jan 15, 2020, 6:27 PM IST

దేశ వ్యాప్తంగా రెండు రోజుల సమ్మెకు పిలుపునిచ్చాయి బ్యాంకు యూనియన్లు. ఈ నెల 31, ఫిబ్రవరి 1న సమ్మె చేయనున్నట్లు యునైటెడ్ ఫోరం ఆఫ్​ బ్యాంక్​ యూనియన్స్ (యూఎఫ్​బీయూ) వెల్లడించింది. ఇండియన్​ బ్యాంక్ అసోసియేషన్​ (ఐబీఏ)తో ఈ నెల 13న .. జరిగిన వేతన సమీక్ష చర్చలు విఫలమవ్వడం కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది.

దేశ వ్యాప్తంగా ఉన్న తొమ్మిది బ్యాంకు యూనియన్ల తరఫున యూఎఫ్​బీయూ ఈ చర్చల్లో పాల్గొంది.

మార్చిలో మరో 3 రోజులు

ఈ రెండు రోజుల.. తర్వాత మార్చి 11-13 మధ్య మరోసారి సమ్మెకు దిగనున్నట్లు యూఎఫ్​బీయూ స్పష్టం చేసింది. అప్పటికీ డిమాండ్లు నేరవేర్చకపోతే.. ఏప్రిల్​ 1 నుంచి నిరవధిక సమ్మె చేయాలని నిర్ణయించుకున్నట్లు యూనియన్ సభ్యుల్లో ఒకరు తెలిపారు.

15 శాతం పెంచాలని..

ఐబీయూతో జరిగిన సమీక్షలో వేతనాలు​ 15 శాతం పెంచాలని యూఎఫ్​బీయూ కోరింది. ఐబీఏ మాత్రం 12.25 శాతం పెంపునకు మాత్రమే సుముఖత చూపించిందని సమాచారం.

ఇదీ చూడండి:బంగారం, వెండి ధరలు పైపైకి.. నేటి ధరలు ఇవే

Intro:Body:

https://www.aninews.in/news/national/general-news/siddaramaiah-pitches-for-lingayath-state-chief-to-tackle-bjp-in-north-ktaka20200115101135/

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.