కొద్ది రోజులుగా వరుసగా దిగొచ్చిన బంగారం ధర నేడు మళ్లీ పెరుగుదల బాట పట్టింది. దేశ రాజధాని దిల్లీలో 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి ధర రూ.256 పెరిగి.. రూ.40,441కి చేరింది.
అంతర్జాతీయంగా పసిడి కొనుగోళ్లు ఊపందుకోవడం కారణంగా దేశీయంగా ధరల్లో వృద్ధి నమోదైనట్లు నిపుణులు చెబుతున్నారు.
బంగారంతో పాటే వెండి ధర నేడు పుంజుకుంది. కిలో వెండి ధర నేడు రూ.228 (దిల్లీలో) పెరిగి.. రూ.47,272 వద్దకు చేరింది.
అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు బంగారం ధర 1,552 డాలర్లకు పెరిగింది. వెండి ఔన్సుకు 17.83 డాలర్లకు వృద్ధి చెందింది.
ఇదీ చూడండి:అమెజాన్: భారత యూనిట్ల కోసం రూ.1,700 కోట్లు