ETV Bharat / business

చర్చలు సఫలం.. బ్యాంకుల సమ్మె విరమణ

ఈనెల 26, 27 తేదీల్లో తలపెట్టిన సమ్మెను బ్యాంకు సంఘాలు విరమించుకున్నాయి. కేంద్ర ప్రభుత్వంతో జరిగిన చర్చలు సఫలం కావడం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు అధికారులు.

చర్చలు సఫలం.. బ్యాంకుల సమ్మె విరమణ
author img

By

Published : Sep 24, 2019, 5:11 AM IST

Updated : Oct 1, 2019, 7:02 PM IST

చర్చలు సఫలం.. బ్యాంకుల సమ్మె విరమణ

తమ సమస్యలు పరిష్కరించాలనే డిమాండ్‌తో ఈ నెల 26, 27 తేదీల్లో చేయాలనుకున్న సమ్మెను బ్యాంకు సంఘాలు విరమించుకున్నాయి. కేంద్ర ఆర్థిక కార్యదర్శితో బ్యాంకు సంఘాల నాయకులు జరిపిన చర్చలు ఫలించినందున ఈ నిర్ణయం తీసుకున్నాయి.

నాలుగు బ్యాంకు అధికారుల సంఘాల నాయకులతో కేంద్ర ఆర్థిక కార్యదర్శి రాజీవ్‌కుమార్‌ సోమవారం భేటీ అయ్యారు. వేతన సవరణ, ఐదురోజుల పనిదినాలు, బ్యాంకుల విలీనం, నగదు లావాదేవీల సమయంపై వారి మధ్య చర్చ జరిగింది. సంఘాల నాయకులు లేవనెత్తిన అంశాలపై సుదీర్ఘ చర్చల అనంతరం రాజీవ్‌కుమార్‌ సానుకూలంగా స్పందించారు. వారు ప్రస్తావించిన సమస్యలన్నీ పరిష్కరిస్తామని రాజీవ్‌కుమార్‌ హామీ ఇచ్చారు. ఫలితంగా సమ్మెను విరమించుకుంటున్నట్లు బ్యాంకు అధికారుల సంఘాలు ప్రకటించాయి.

Kishtwar (Jammu and Kashmir), Sep 23 (ANI): Three Hizbul-Mujahideen terrorists were arrested in Jammu and Kashmir's Kishtwar on September 23. They have been arrested in the case of killing RSS leader Chanderkant Sharma and his PSO. Among these arrested people, one terrorist identified as Nisar Ahmad Sheikh. Sheikh was the part of conspiracy and was present during the killing of BJP leader Anil Parihar.
Last Updated : Oct 1, 2019, 7:02 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.