Auto Sales: డిసెంబర్ నెలలో వాహన విక్రయాలు మిశ్రమంగా నమోదయ్యాయి. దేశీయ వాహన దిగ్గజ సంస్థ మారుతీ సుజుకీ, హ్యుందాయ్ విక్రయాలు 2021 డిసెంబర్లో క్షీణించాయి. టాటా మోటార్స్, మహీంద్రా అండ్ మహీంద్రా విక్రయాలు మాత్రం గణనీయంగా మెరుగుపడ్డాయి.
- నిస్సాన్ మోటార్, స్కోడా సేల్స్ కూడా పెరిగాయి.
- హోండా కార్స్ విక్రయాలు మాత్రం పడిపోయాయి.
- సెమీకండక్టర్ కొరత మాత్రం వాహనాల ఉత్పత్తిపైనే ఇంకా ప్రభావం చూపిస్తూనే ఉంది.
విక్రయాలు ఇలా..
- మారుతీ సుజుకీ ఇండియా దేశీయ కార్ల విక్రయాలు 13 శాతం పతనం అయ్యాయి. 2020 డిసెంబర్లో 1,50,228 మారుతీ కార్లు అమ్ముడవగా.. 2021లో ఆ సంఖ్య 1,30,869కి పరిమితమైంది.
ఎలక్ట్రానిక్ ఉపకరణాల కొరత తమ కార్ల ఉత్పత్తిపై స్వల్ప ప్రభావం చూపించినట్లు మారుతీ సుజుకీ ఇండియా ఓ ప్రకటనలో తెలిపింది.
- హ్యుందాయ్ మోటార్ ఇండియా కార్ల దేశీయ విక్రయాలు ఏకంగా 32 శాతం పడిపోయాయి. 2020 డిసెంబర్లో 47,400 యూనిట్లు అమ్ముడుపోగా.. 2021లో ఆ సంఖ్య 32,312గా ఉంది.
- Tata Motors Sales: ప్యాసింజర్ వాహనాల (పీవీ) విక్రయాల్లో టాటా మోటార్స్ 50 శాతం వృద్ధిని నమోదు చేసింది. గతేడాది డిసెంబర్లో ఈ సంస్థ 23 వేలకుపైగా కార్లను అమ్మగా.. 2021లో 35,299 యూనిట్లను విక్రయించింది.
2021 డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో మంచి మైలురాళ్లను చేరుకున్నట్లు తెలిపారు టాటా మోటార్స్ (పీవీ బిజినెస్ యూనిట్) అధ్యక్షుడు శైలేశ్ చంద్ర. అయితే.. సెమీకండక్టర్ల కొరత తమ మార్కెట్‌పై ప్రభావం చూపొచ్చని, కొవిడ్-19 పరిణామాలను కూడా జాగ్రత్తగా పరిశీలించాల్సిన అవసరం ఉందని చెప్పారు.
- M&M Sales December 2021: మహీంద్రా అండ్ మహీంద్రా దేశీయ కార్ల అమ్మకాలు 10 శాతం మెరుగుపడ్డాయి.
- నిస్సాన్ మోటార్ ఇండియా లిమిటెడ్ కార్ల సేల్స్ రెట్టింపు అయ్యాయి.
- స్కోడా ఆటో ఇండియా కార్ల విక్రయాల్లో.. దాదాపు 25 శాతం వృద్ధి నమోదైంది.
- హెండా కార్స్ ఇండియా లిమిటెడ్.. 8 శాతం తక్కువ గణాంకాల్ని నమోదు చేసింది.
ఇవీ చూడండి: కొత్త సంవత్సరం నుంచి ఏటీఎం ఛార్జీల పెంపు
GST Collection: వరుసగా ఆరో నెలా రూ.లక్ష కోట్లు దాటిన జీఎస్టీ వసూళ్లు