ETV Bharat / business

కొవిడ్‌-19 టీకా తయారీలో అరబిందో ఫార్మా ముందడుగు - కరోనా వ్యాక్సిన్ లేటెస్ట్ అప్​డేట్స్

కరోనా వైరస్​కు టీకా తయారీ కోసం ఫార్మా సంస్థ అరబిందో.. బయోటెక్నాలజీ ఇండస్ట్రీ రీసెర్చ్ అసిస్టెన్స్ కౌన్సిల్​, కౌన్సిల్‌ ఆఫ్‌ సైంటిఫిక్‌ అండ్‌ ఇండస్ట్రియల్‌ రీసెర్చ్​(సీఎస్‌ఐఆర్‌తో)తో భాగస్వామ్యాలు కుదుర్చుకుంది. సీఎస్‌ఐఆర్‌తో కుదిరిన ఒప్పందం ప్రకారం.. కరోనా వ్యాక్సిన్​ తయారీ, విక్రయ కార్యకలాపాలపై అరబిందో దృష్టి సారించనుంది.

Aurobindo Pharma ties up with BIRAC for Corona vaccine
కొవిడ్ వ్యాక్సిన్​ కోసం అరబిందో కీలక ఒప్పందం
author img

By

Published : Sep 16, 2020, 10:46 AM IST

అరబిందో ఫార్మా కొవిడ్‌-19 టీకా అభివృద్ధి చేయనుంది. దీని కోసం సీఎస్‌ఐఆర్‌ (కౌన్సిల్‌ ఆఫ్‌ సైంటిఫిక్‌ అండ్‌ ఇండస్ట్రియల్‌ రీసెర్చ్‌)తో, కేంద్ర ప్రభుత్వ బయోటెక్నాలజీ శాఖ సారథ్యంలోని బయోటెక్నాలజీ ఇండస్ట్రీ రీసెర్చ్‌ అసిస్టెన్స్‌ కౌన్సిల్‌ (బీఐఆర్‌ఏసీ)తో భాగస్వామ్యాలు కుదుర్చుకుంది.

సీఎస్‌ఐఆర్‌తో కుదిరిన ఒప్పందం ప్రకారం అరబిందో ఫార్మా కొవిడ్‌-19 టీకా తయారీ, విక్రయ కార్యకలాపాలపై దృష్టి సారిస్తుంది. సీఎస్‌ఐఆర్‌కు చెందిన పరిశోధనా సంస్థలైన సీసీఎంబీ- హైదరాబాద్‌, ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ టెక్నాలజీ- చండీగఢ్‌, ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కెమికల్‌ బయాలజీ- కోల్‌కతా, కొవిడ్‌-19 వ్యాక్సిన్‌పై విస్తృత స్థాయిలో పరిశోధనలు చేస్తున్నాయి. వేర్వేరు వ్యాక్సిన్‌ ప్లాట్‌ఫామ్‌లపై నిర్వహిస్తున్న ప్రయోగాలు విజయవంతమైతే టీకా తయారీ, విక్రయ బాధ్యతలను అరబిందో ఫార్మా చేపడుతుంది.

స్వతంత్రంగా టీకా అభివృద్ధి చేసి, ప్రజలకు అందించాలనే లక్ష్యసాధన దిశగా ఔషధాల తయారీలో విశేష అనుభవం ఉన్న అరబిందో ఫార్మాతో జట్టుకట్టినట్లు సీసీఎంబీ డైరెక్టర్‌ డాక్టర్‌ రాకేష్‌ మిశ్రా పేర్కొన్నారు. మనదేశంలో తొలిసారిగా ‘ఆర్‌-వీఎస్‌వీ వ్యాక్సిన్‌’ మానుఫ్యాక్చరింగ్‌ ప్లాట్‌ఫామ్‌ ఏర్పాటుకు బయోటెక్నాలజీ ఇండస్ట్రీ రీసెర్చ్‌ అసిస్టెన్స్‌ కౌన్సిల్‌ (బీఐఆర్‌ఏసీ)తో అరబిందో ఫార్మా భాగస్వామ్యం కుదుర్చుకుంది.

వైరల్‌ వ్యాక్సిన్ల తయారీకి హైదరాబాద్‌లో అధునాతన యూనిట్‌ నెలకొల్పుతున్నట్లు, కొవిడ్‌-19 టీకా ఈ యూనిట్లోనే తయారు చేస్తామని అరబిందో ఫార్మా ఎండీ ఎన్‌.గోవిందరాజన్‌ పేర్కొన్నారు. టీకా అభివృద్ధి-తయారీ- విక్రయ వ్యవహారాల్లో యూఎస్‌లోని తన సబ్సిడరీ కంపెనీ ఆరో వ్యాక్సిన్స్‌కు ఎంతో అనుభవం ఉన్నట్లు వివరించారు.

కొవిడ్‌-19ను ఎదుర్కొనటంలో అరబిందో ఫార్మాతో కుదుర్చుకున్న భాగస్వామ్యం కీలకమైన పరిణామంగా కేంద్ర ప్రభుత్వ బయోటెక్నాలజీ శాఖ కార్యదర్శి రేణు స్వరూప్‌ అభిప్రాయపడ్డారు.

ఇదీ చూడండి:నిరుద్యోగులకు ఫ్లిప్​కార్ట్​ శుభవార్త

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.