రతన్ టాటా.. పారిశ్రామికవేత్తగా, దాతృత్వవేత్తగా కోట్లాది మందికి ఆదర్శం. ఆయన మాట్లాడే ప్రతి మాట ఎంతో మందికి స్పూర్తిగా నిలుస్తుంది. నచ్చిన ప్యాషన్‌ను ఫాలో కావడం, ఏదైనా కొత్తగా నేర్చుకోవడానికి వయస్సుతో సంబంధం లేదనే విషయాన్ని కూడా ఆయన రుజువు చేస్తున్నారు.
83 ఏళ్ల వయస్సులో కూడా పియానో నేర్చుకోవడం గురించి ఆసక్తిగా ఉన్నట్లు.. ఇన్స్టాగ్రామ్ ద్వారా తన ఇష్టాన్ని బయటపెట్టారు రతన్ టాటా.
ఇన్‌స్టా పోస్ట్‌లో ఏముంది?
రతన్ టాటా తాను పియానో ప్లే చేస్తున్న ఓ ఫొటోను ఇన్‌స్టాలో ఇటీవల షేర్ చేశారు. దానికి.. 'బాల్యంలో ఉన్నప్పుడు పియానో ప్లే చేయడం కొంత నేర్చుకున్నా. బాగా ప్లే చేయాలనే కోరిక ఇంకా ఉంది. 2012 డిసెంబర్లో టాటా గ్రూప్ ఛైర్మన్ పదవి నుంచి తప్పుకున్నప్పుడు .. ఓ గొప్ప పియానో టీచర్ దొరికారు. కానీ రెండు చేతులతో సరిగ్గా పియానో ప్లే చేసేందుకు కావాల్సినంత శ్రద్ధను చూపలేకపోయాను. భవిష్యత్‌లో మరోసారి ప్రయత్నించాలని ఆశిస్తున్నా.' అని ఆ ఫొటోకు క్యాప్షన్ రాసుకొచ్చారు రతన్ టాటా.
83 ఏళ్ల వయస్సులో ఓ యువకుడిలా తన ప్యాషన్‌ను ఫాలో అవుతూ.. కొత్త విషయం నేర్చుకునేందుకు రతన్ ఆసక్తి చూపుతుండటంపై నెజిజన్లు ఆశ్చర్యపోతున్నారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
విమానాలన్నా ఆసక్తి...
రతన్ టాటాకు విమానాలు నడపడమన్నా ఎంతో ఇష్టం. ఆయనకు సొంతంగా విమానాలు నడిపేందుకు లైసెన్స్ కూడా ఉంది. ఎన్నో సార్లు ఎయిర్‌క్రాఫ్ట్‌లను నడిపించిన అనుభవం ఆయన సొంతం.
ఇదీ చదవండి: