ప్రముఖ లగ్జరీ ఎలక్ట్రానిక్ ఉపకరణాల తయారీ సంస్థ యాపిల్.. భారత్‌లో తొలి అధికారిక ఆన్లైన్ స్టోర్‌ను ప్రారంభించేందుకు సిద్ధమైంది. ఈ నెల 23న భారత్‌లో ఆన్లైన్ స్టోర్ అందుబాటులోకి రానున్నట్లు సంస్థ సీఈఓ టిక్‌కుక్ ట్విట్టర్లో ప్రకటించారు. యాపిల్‌కు చెందిన అన్ని రకాల ఉత్పత్తులు ఆన్లైన్ స్టోర్‌లో అందుబాటులో ఉంటాయని తెలిపారు.
వినియోగదారుల సౌలభ్యం కోసం ఆన్లైన్ సపోర్ట్ సేవలను కూడా తీసుకురానున్నట్లు వెల్లడించింది యాపిల్. ప్రోడక్ట్‌ల వివరాలు, మ్యాక్ కస్టమ్ కాన్ఫిగరింగ్ వంటి వాటి సహాయానికి ఈ సేవలు వినియోగించుకోవచ్చని తెలిపింది. ఇంగ్లీష్, హిందీ భాషల్లో కస్టమర్ సపోర్ట్ సేవలు అందుబాటులో ఉంటాయని వివరించింది.
ప్రత్యేక ఆఫర్లు..
విద్యార్థుల కోసం మ్యాక్‌బుక్, ఐప్యాడ్స్, యాపిల్ర్+ సహా పలు ఇతర ఉత్పత్తులపై డిస్కౌంట్ అందించనున్నట్లు యాపిల్ ప్రకటిచింది.
పండుగ సీజన్ నేపథ్యంలో..
ప్రస్తుతం థర్డ్‌పార్టీ ఈ కామర్స్, ఆఫ్‌లైన్ స్టోర్ల ద్వారా దేశంలో సేవలందిస్తోంది యాపిల్. అధికారిక ఆన్లైన్ స్టోర్ ఈ ఏడాది ప్రథమార్ధంలోనే ప్రారంభించాని భావించింది. అయితే కరోనా వల్ల అందులో జాప్యం జరిగింది. ఇప్పుడు త్వరలో పండుగ సీజన్ రానున్న నేపథ్యంలో యాపిల్ తాజాగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
భారత్‌లో ఆఫ్‌లైన్ రిటైల్ స్టోర్‌ను వచ్చే ఏడాది ముంబయిలో ప్రారంభించనున్నట్లు.. యాపిల్ సీఈఓ టిమ్ కుక్ ఇదివరకే అధికారికంగా ప్రకటించారు.
ఇదీ చూడండి:ఈఎస్ఐ చందాదారులకు నిరుద్యోగ భృతి చెల్లింపు