ప్రముఖ షార్ట్ వీడియో యాప్ టిక్‌టాక్ కొనుగోలుకు తాము ఆసక్తిగా లేమని టెక్ దిగ్గజం యాపిల్ ప్రకటించింది. టిక్‌టాక్‌ను సొంతం చేసుకునేందుకు యాపిల్ ప్రయత్నిస్తోందంటూ ఇటీవల పలు వార్తలొచ్చాయి. ఈ మేరకు ఆ వార్తలను తోసిపుచ్చుతూ.. స్పష్టతనిచ్చింది యాపిల్.
మరో టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ మాత్రం.. టిక్‌టాక్ అమెరికా వ్యాపారాలు కొనుగోలు చేసేందుకు దాని మాతృ సంస్థ బైట్ డ్యాన్స్‌తో చర్చలు జరుపుతున్నట్లు అధికారికంగా ప్రకటించింది. టిక్‌టాక్‌పై అమెరికా ప్రభుత్వం వ్యక్తం చేస్తున్న ఆందోళనల గురించి.. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల ఇటీవలే చర్చలు కూడా జరిపారు.
ఇదిలా ఉండగా.. సెప్టెంబర్ 15లోపు టిక్‌టాక్‌ను విక్రయించకుంటే నిషేధం తప్పదని బైట్ డ్యాన్స్‌ను ఇదివరకే హెచ్చరించారు ట్రంప్.
ఇవీ చూడండి: