భారత్‌లో మొబైల్ ఫోన్ల ధరలను పెంచుతున్నట్లు ప్రకటించాయి రియల్మీ, యాపిల్ సంస్థలు. ఏప్రిల్ 1 నుంచే నూతన ధరలు అమల్లోకి వచ్చినట్లు వెల్లడించాయి.
కరోనా, జీఎస్టీ కారణంగానే...
కరోనా సంక్షోభంతో ఇప్పటికే ఫోన్ల ఉత్పత్తి నిలిచిపోయింది. ఇలా ఏర్పడుతున్న కొరతకు తోడు... స్మార్ట్ఫోన్లపై జీఎస్టీని 12 శాతం నుంచి 18 శాతానికి పెంచుతూ భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో దేశంలో మొబైల్ ధరలకు రెక్కలొస్తున్నాయి. రూపాయి విలువ రోజురోజుకూ క్షీణిస్తున్నందున ప్రముఖ స్మార్ట్‌ఫోన్ సంస్థలు ధరల పెంపునకు మొగ్గుచూపుతున్నాయి. యాపిల్‌తో పాటు చైనా స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ రియల్మీ ఇదే దారిని అనుసరించాయి.
పెరిగిన రియల్మీ ధరలు ఇలా
రియల్మీ దాదాపు ప్రతి మోడల్‌పై రూ.1000 పెంచింది.
మోడల్ | పాత ధర | నూతన ధర |
రియల్మీ 6 (4జీబీ+64జీబీ) | రూ.12,999 | రూ.13,999 |
రియల్మీ ఎక్స్2 (4జీబీ+64జీబీ) | రూ.16,999 | రూ.17,999 |
రియల్మీ ఎక్స్‌టీ (4జీబీ+64జీబీ) | రూ.15,999 | రూ.16,999 |
ఐఫోన్ ధరలు ఇలా..
ఐఫోన్ నూతన ధరలను మోడల్‌ను బట్టి నిర్ణయించింది యాపిల్ సంస్థ.
మోడల్ | పాత ధర | నూతన ధర |
ఐఫోన్ 11 (64 జీబీ) | రూ.64,900 | రూ.68,300 |
ఐఫోన్ ఎక్స్ఆర్ (64 జీబీ) | రూ.49,900 | రూ.52,500 |
ఐఫోన్ 11ప్రో (64 జీబీ) | రూ.1,01,200 | రూ.1,06,600 |
ఐఫోన్ 11 మ్యాక్స్ (64 జీబీ) | రూ.1,11,200 | రూ.1,17,100 |
ఐఫోన్ 7 (32 జీబీ) | రూ.29,900 | రూ.31,500 |