లగ్జరీ గాడ్జెట్స్ తయారీ సంస్థ యాపిల్ ఈ ఏడాది భారీగా కొత్త మోడల్ ఐఫోన్లను తీసుకువచ్చే దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. పలు టెక్ వార్తా సంస్థల ప్రకారం ఈ ఏడాది మొత్తం 6 ఐఫోన్లను మార్కెట్లోకి తెచ్చేందుకు యాపిల్ ప్రణాళికలు చేస్తోంది. విశేషమేంటంటే.. వీటిలో రెండు మోడళ్లు సరసమైన ధరల్లో అందుబాటులోకి రానున్నాయి.
నాలుగు ప్రీమియం మోడళ్లు ఓఎల్ఈడీ తెర.. తక్కువ ధర మోడళ్లలో ఎల్సీడీ డిస్ప్లేలను కలిగి ఉండే అవకాశముంది.
తక్కువ ధర ఫోన్లు ఎలా ఉండనున్నాయంటే..
యాపిల్ వర్గాల సమాచారం ప్రకారం.. ఎస్ఈ సిరీస్ కొనసాగింపులో భాగంగా రెండు బడ్జెట్ ఫోన్లను తీసుకురానుంది. ఇందులో ఒకటి 5.5 అంగుళాలు, మరొకటి 6.1 అంగుళాల తెరతో రానున్నాయి. ఇంతకు ముందూ.. యాపిల్ 2020లో 5 ఐఫోన్ మోడళ్లను తీసుకురానుందనే వార్తలొచ్చాయి. వాటిలో కనీసం రెండు మోడళ్లు 5జీ వేరియంట్లు.. వేరు వేరు ధరల సెగ్మెంట్లో రానున్నట్లు అవి పేర్కొన్నాయి.
యాపిల్ సంస్థ కూడా..
ఐఫోన్ ఎస్ఈకి కొనసాగింపుగా మిడ్ రేంజ్లో ఓ మోడల్‌ను తీసుకురానున్నట్లు వెల్లడించింది. అయితే తాజా సమాచారం ప్రకారం మిడ్ రేంజ్లో రెండు స్మార్ట్ ఫోన్లను తీసుకురాన్నట్లు తెలుస్తోంది.
ఇప్పుడున్న సమాచారం ప్రకారం.. ఐఫోన్ ఎస్ఈకి కొనసాగింపుగా ఐఫోన్ 9, ఐఫోన్ 9ప్రో పేరుతో రానున్నాయి. వీటితో పాటు ఈ ఏడాది పలు కొత్త మోడళ్లను తీసుకురానున్నట్లు తెలుస్తోంది. ఇవన్నీ భారత మార్కెట్లో యాపిల్‌కు ఏ మేరకు దోహదం చేస్తాయో వేచి చూడాలి.
ఇదీ చూడండి:2636 ఛార్జింగ్ కేంద్రాల ఏర్పాటుకు కేంద్రం గ్రీన్‌సిగ్నల్