దేశంలో మొబైల్ తయారీ రంగాన్ని అభివృద్ధి చేయాలని ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు అనుగుణంగా టెక్ దిగ్గజం యాపిల్.. భారత్‌లో 'ఐఫోన్ ఎక్స్ఆర్' ఫోన్ల ఉత్పత్తిని ప్రారంభించింది.
సాల్కాంప్ చేతికి నోకియా..
ఇందులో భాగంగా యాపిల్ సంస్థకు ఛార్జర్లు సరఫరా చేస్తోన్న సాల్కాంప్తో.. కీలక ఒప్పందం చేసుకున్నట్లు చెప్పారు కేంద్ర మంత్రి. చెన్నై సమీపంలో నోకియాకు చెందిన సెజ్‌ను సాల్కాంప్కు అప్పగిస్తున్నట్లు తెలిపారు.
నోకియాకు చెందిన యూనిట్ సుమారు 10 ఏళ్ల క్రితం మూతపడింది. దీనిని సాల్కాంప్ తెరవనుంది. ఇందులో ఛార్జర్లు, ఇతర వస్తువులను తయారు చేయనుండగా.. 2020 నుంచి ఉత్పత్తి ప్రారంభమవుతుందని తెలిపింది సాల్కాంప్. ఈ యూనిట్‌పై వచ్చే ఐదేళ్లలో రూ.2వేల కోట్లు పెట్టుబడిగా పెట్టనుంది.
" పదేళ్ల క్రితం మూతపడిన నోకియాకు చెందిన అతిపెద్ద సెజ్ తిరిగి తెరుచుకోనుంది. ఇందులో ప్రత్యక్షంగా సుమారు 10వేల మందికి ఉపాధి దొరుకుతుంది. పరోక్షంగా మరో 50వేల మందికి ఉపాధి లభించనుంది. భారత మొబైల్, దాని అనుబంధ వస్తువుల ఎగుమతి 2019-20 ఆర్థిక సంవత్సరానికి 1.6 బిలియన్ డాలర్లకు చేరనుంది."
- రవిశంకర్ ప్రసాద్, కేంద్ర సమాచార, సాంకేతిక శాఖ మంత్రి.
ఇదీ చూడండి: ఉంటుందా.. ఊడుతుందా? ఐటీ ఉద్యోగుల్లో ఆందోళన