ETV Bharat / business

భారత్​లో ఐఫోన్​ మరింత ప్రియం- పెరిగిన ధరలివే..

భారత్​లో ఐఫోన్​ ధరలు పెరిగాయి. ఐఫోన్​ 11 ప్రో, ఐఫోన్​ 11 ప్రో మ్యాక్స్​, ఐఫోన్​ 8 ధరలను యాపిల్​ సంస్థ పెంచింది. మొబైల్​ ఫోన్​ దిగుమతులకు సంబంధించి కస్టమ్స్​ సుంకాన్ని పెంచడమే ఇందుకు కారణమని తెలిపింది.

author img

By

Published : Mar 2, 2020, 3:05 PM IST

Updated : Mar 3, 2020, 4:08 AM IST

iphone
ఐఫోన్​

భారత్​లో కొన్ని హై-ఎండ్ ఐఫోన్ మోడళ్ల ధరలను పెంచింది యాపిల్​ సంస్థ. కేంద్ర బడ్జెట్- 2020లో సాంఘిక సంక్షేమ సర్‌చార్జితో పాటు దిగుమతి చేసుకున్న మొబైల్ ఫోన్లు, ఛార్జర్‌లపై సుంకాలను పెంచింది ప్రభుత్వం. ఈ నేపథ్యంలో ఐఫోన్​ 11 ప్రో, ఐఫోన్​ 11 ప్రో మ్యాక్స్​, ఐఫోన్​ 8 ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకుంది యాపిల్. పెరిగిన ధరలు నేటి నుంచి అమల్లోకి వచ్చాయి.

ఐఫోన్​ 11 ప్రో మ్యాక్స్​..

ఐఫోన్​ 11 ప్రో మ్యాక్స్​ మోడల్​ ప్రారంభ ధర తొలుత రూ.1,09,900గా ఉండేది. ప్రస్తుతం ధరలు ఇలా..

  • 64జీబీ వేరియంట్​- రూ.1,11,200
  • 256జీబీ వేరియంట్​- రూ.1,25,200
  • 512జీబీ వేరియంట్​- రూ.1,43,200

ఐఫోన్​ 11 ప్రో..

ఐఫోన్​ 11 ప్రో మోడళ్ల ప్రారంభ ధర రూ.99,900గా ఉండేది. వీటిపై దాదాపు రూ.1,300 మేర పెంచింది యాపిల్​.

  • 64జీబీ వేరియంట్​- రూ.1,01,200
  • 256జీబీ వేరియంట్​- రూ.1,15,200
  • 512జీబీ వేరియంట్​- రూ.1,33,200

ఐఫోన్​ 8

ఐఫోన్​ 8 ప్లస్​ (64జీబీ) ధర రూ.50,600.. 128జీబీ ధర రూ.55,600గా ఉంది. ఐఫోన్​ 8 (64జీబీ) ధర రూ.40,500.. 128జీబీ ధర రూ.45,500గా ఉంది.

వీటి ధరల్లో మార్పు లేదు..

యాపిల్​ సరఫరాదారులు ఫాక్స్​కాన్​, విస్ట్రాన్.. భారత్​లోనే​ ఐఫోన్​ ఎక్స్​ఆర్​, ఐఫోన్​ 7 తయారు చేస్తున్నాయి. ఫలితంగా వీటి ధరల్లో ఎలాంటి మార్పులు చేయలేదు యాపిల్. వీటితో పాటు ఐఫోన్​ 11, ఐప్యాడ్​, యాపిల్ వాచ్​, మ్యాక్​ డెస్క్​టాప్​ ధరలనూ పెంచలేదు.

కరోనా ప్రభావేమీ లేదు..

ధరల పెంపునకు కరోనా వైరస్​ కారణం కాదని కంపెనీ వర్గాలు తెలిపాయి. కస్టమ్​ సుంకాల వల్లే ధరలు పెరిగాయని స్పష్టం చేశాయి.

తొలుత మొబైల్​ ఫోన్లకు సంబంధించి 10 శాతం సేవా సంక్షేమ రుసుముగా చెల్లించే పన్నుపై మినహాయింపు ఇచ్చింది ప్రభుత్వం. మొబైల్​ ఫోన్​ దిగుమతులపై 20 శాతం కస్టమ్​ సుంకాలుగా తిరిగి వడ్డించింది. పీసీబీఏ(ప్రింటెడ్​ సర్య్కూట్​ బోర్డ్​ అసెంబ్లీ)పై 10 శాతంగా ఉన్న కస్టమ్స్​ సుంకాన్ని 20శాతానికి పెంచింది.

ఇదీ చూడండి: ఈపీఎఫ్​ డిపాజిట్లపై వడ్డీ రేటు మళ్లీ 8.65 శాతమే!

Last Updated : Mar 3, 2020, 4:08 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.